నడుము చుట్టూ కొవ్వు కరగాలా? ఈ కిచిడీ తింటే ఫలితం పక్కా!

Posted By:

ప్రస్తుత రోజుల్లో చాలామంది బరువు తగ్గడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కఠినమైన డైట్లు, చప్పని ఆహారాలు తింటూ చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే బరువు తగ్గడం అంటే ఆకలితో అలమటించడం లేదా రుచిలేని ఆహారాన్ని తినడం అని అర్థం కాదు. సరైన ఆహార పదార్థాలను ఎంచుకుంటే కడుపు నిండా తింటూనే ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. అలాంటి అద్భుతమైన ఆహారమే మొక్కజొన్న, ఇతర తృణధాన్యాలు.

సాధారణంగా మనం డైట్ చేసేటప్పుడు తృణధాన్యాలతో గంజి లేదా జావ కాచుకుని తాగుతాం. కానీ రోజూ అదే తింటే బోర్ కొడుతుంది. అందుకే మీ డైట్ ని మరింత రుచికరంగా మార్చేందుకు మొక్కజొన్నతో కిచిడీ చేసుకుని తినడం ఉత్తమ మార్గం. ఇందులో రకరకాల కూరగాయలు, పప్పు కలవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. ముఖ్యంగా మొక్కజొన్నలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తుంది. తద్వారా మీరు బరువు త్వరగా తగ్గుతారు.

Lose Weight Without Starving Try This Delicious Corn Khichdi Recipe in Telugu

కావలసిన పదార్థాలు
ఎండిన మొక్కజొన్న గింజలు: 100 గ్రాములు
పెసర పప్పు: 25 గ్రాములు
నెయ్యి: 1 టేబుల్ స్పూన్
సోంపు: చిటికెడు
దాల్చిన చెక్క: 1 చిన్న ముక్క
లవంగం: 1
బిర్యానీ ఆకు: 1
ఉల్లిపాయ: 1
బీన్స్: 5
క్యారెట్: 1
టమోటా: 1
పచ్చిమిర్చి: 2
అల్లం తురుము: పావు అంగుళం
కరివేపాకు:1 రెమ్మ
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు: తగినంత
పసుపు: పావు టీస్పూన్
నిమ్మరసం: పావు టీస్పూన్
నీరు: 4 కప్పులు

తయారీ విధానం

-ముందుగా మొక్కజొన్న గింజలను రెండుసార్లు శుభ్రంగా కడగాలి.

-తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కడిగిన మొక్కజొన్నను వేసి, వాటిలోని తడి ఆరిపోయే వరకు దోరగా వేయించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి మరీ మెత్తగా కాకుండా,రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి.

-తర్వాత పెసర పప్పును శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

-తర్వాత కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేయాలి.

-నెయ్యి వేడెక్కిన తర్వాత సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, తురిమిన అల్లం వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్ వేసి కాస్త ఉప్పు చల్లి బాగా మగ్గనివ్వాలి. కూరగాయలు కాస్త వేగాక తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.

-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మొక్కజొన్న రవ్వను స్టవ్ మీద పాన్ లో వేసి బాగా కలపాలి. ఆ వెంటనే నానబెట్టిన పప్పును కూడా వేసి మరో 3-4 నిమిషాల పాటు వేయించాలి.

-ఇప్పుడు పాన్ లో 4 కప్పుల నీరు పోయాలి. చివరగా చిటికెడు పసుపు, కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం పిండి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

-విజిల్స్ వచ్చి, ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే.. ఘుమఘుమలాడే వేడి వేడి మొక్కజొన్న కిచిడీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, December 12, 2025, 7:24 [IST]
Desktop Bottom Promotion