Latest Updates
-
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?
మహారాష్ట్ర స్టైల్ గుత్తి వంకాయ కూర..ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
తెలుగువారికి వంకాయ అంటే ప్రాణం. అందులోనూ గుత్తి వంకాయ కూర కనిపిస్తే లొట్టలేసుకుంటూ తింటారు. అయితే, మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర స్టైల్ లో చేసే స్టఫ్డ్ వంకాయ(భర్లీ వాంగీ) రుచి చూశారా? లేదంటే మాత్రం మీరు ఒక అద్భుతమైన వంటకాన్ని మిస్ అవుతున్నట్లే. కొబ్బరి, వేరుశెనగల కమ్మదనానికి కాస్త చింతపండు పులుపు, బెల్లం తీపి తోడైతే ఆ రుచి మాటల్లో చెప్పలేం. అన్నం, రొట్టె దేనిలోకైనా పర్ఫెక్ట్ గా సరిపోయే ఈ మహారాష్ట్ర స్పెషల్ వంకాయ కూరను ఇంట్లోనే సులభంగా, నోరూరించేలా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

మహారాష్ట్రన్ స్టైల్ గుత్తి వంకాయ కూర తయారీకి కావలసిన పదార్థాలు
లేత వంకాయలు - 6,
ఉప్పు, నీళ్లు - తగినంత
ఎండు కొబ్బరి - 25 గ్రాములు
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - కొద్దిగా
తెల్ల నువ్వులు - 1 టీస్పూన్
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - 55 గ్రాములు
పచ్చి కొత్తిమీర - గుప్పెడు
ఉల్లిపాయ-వెల్లుల్లి మసాలా - 2 టేబుల్ స్పూన్లు
చింతపండు గుజ్జు - 2 టీస్పూన్లు
బెల్లం - చిటికెడు
పసుపు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా.
నూనె - 3 టీస్పూన్లు
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
ఇంగువ - 1/2 టీస్పూన్
కరివేపాకు - 10-12 ఆకులు
పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
వేడి నీళ్లు - తగినంత
మహారాష్ట్రన్ స్టైల్ గుత్తి వంకాయ కూర తయారీ విధానం
-ముందుగా వంకాయలను తీసుకుని కడగాలి. వాటి కాడలను కొద్దిగా ఉంచి, అడుగు భాగం నుండి ప్లస్ (+) ఆకారంలో అడ్డంగా గాట్లు పెట్టండి. వంకాయలు కండ్రెక్కకుండా ఒక గిన్నెలో ఉప్పు నీళ్లు పోసి, ఈ వంకాయలను అందులో వేసి పక్కన పెట్టుకోండి.
-స్టవ్ మీద ఒక బాండీ పెట్టి, అందులో ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, తెల్ల నువ్వులు వేసి వేయించండి. కొబ్బరి లేత బంగారు రంగులోకి మారి కమ్మటి వాసన వస్తున్నప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. అదే బాణలిలో వేరుశెనగలను కూడా మీడియం మంట మీద దోరగా వేయించండి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్ లో వేసి కరకరలాడేలా (కాస్త బరకగా) గ్రైండ్ చేసుకోండి.
-ఈ పొడిలో ఉల్లిపాయ-వెల్లుల్లి మసాలా, చింతపండు గుజ్జు, బెల్లం, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. మీ స్టఫింగ్ మసాలా రెడీ.
-ఉప్పు నీటిలో ఉన్న వంకాయలను బయటకు తీసి, పొడి గుడ్డతో తడి లేకుండా తుడవండి. ఇప్పుడు తయారు చేసిన మసాలాను వంకాయల గాట్లలోకి గట్టిగా నొక్కుతూ నింపండి. మిగిలిన మసాలాను గ్రేవీ కోసం పక్కన పెట్టుకోండి.
-బాండీలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు పెద్ద మంట మీద వేయించండి. ఇప్పుడు మసాలా కూరిన వంకాయలను వేసి, పైన రంగు మారే వరకు 3-4 నిమిషాల పాటు అటూ ఇటూ తిప్పుతూ వేయించండి.
-వంకాయలు కాస్త మగ్గాక, పక్కన ఉంచిన మిగిలిన మసాలాను కూడా వేసి కలపండి. గ్రేవీకి సరిపడా వేడి నీళ్లు పోసి సున్నితంగా కలపండి. మంట తక్కువ చేసి, మూత పెట్టి 8-10 నిమిషాల పాటు ఉడికించండి. మసాలా చిక్కబడి వంకాయ మెత్తగా ఉడికాక కొత్తిమీర చల్లుకోండి.
-అంతే ఘుమఘుమలాడే రుచికరమైన మహారాష్ట్రన్ స్టైల్ స్టఫ్డ్ వంకాయ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
