Latest Updates
-
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోరూరించే రుచి, ఆరోగ్యానికి మేలు..క్రీమీ పనీర్ నూడుల్స్ ఒక్కసారి రుచి చూశారంటే రోజూ ఇదే కావాలంటారు.. -
ఐరన్, ప్రోటీన్ నిండిన బలవర్థకమైన వేరుశెనగ చిక్కీ..చలికాలంలో బెస్ట్ హెల్తీ స్నాక్..ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్!
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
దక్షి భారతీయ వంటకాల్లో ముఖ్యంగా తమిళనాడు రుచుల్లో పచ్చళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ ఘాటుగా, కారారసంగా ఉండే చట్నీలు ఇడ్లీ, దోశ, అప్పం వంటి టిఫిన్లకు అద్భుతమైన జోడీగా నిలుస్తాయి. అలాంటి వాటిలో మదురై స్టైల్ వెల్లుల్లి చట్నీ ప్రత్యేకమైనది. వెల్లుల్లి ఘాటు, చింతపల్లి పులుపు, కారకారలాడే మిరపకాయల కలయికతో తయారయ్యే ఈ చట్నీ కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఒక్కసారి రుచి చూస్తే, ప్రతీ రోజూ టిఫిన్ తో పాటు ఇదే కావాలని అడుగుతారు. మదురై స్టైల్ ఘాటు ఘాటు వెల్లుల్లి చట్నీ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
వేయించడానికి:
నువ్వుల నూనె- 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - అర కప్పు
ఎండు మిరపకాయలు - 2
సాంబార్ ఉల్లిపాయలు - 1
కరివేపాకు - రెమ్మలు కొద్దిగా
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
చింతపండు - చిన్న ముక్క
పోపు కోసం:
నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - కొన్ని

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, సాంబార్ ఉల్లిపాయ వేసి సుమారు ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత అందులోనే కరివేపాకు, మినపప్పు, చిన్న చింతపండు ముక్క వేయాలి. వెల్లుల్లి మంచి బంగారు రంగులోకి మారి, మినపప్పు చక్కగా వేగి సువాసన వచ్చే వరకు మంటను మీడియంగా ఉంచి వేయించుకోవాలి.
-వేయించుకున్న మిశ్రమాన్ని స్టవ్ మీద నుండి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్ లో వేసి, తగినంత ఉప్పు, కొద్దిగా నీరు జోడించి మెత్తగా, పచ్చడిలా గ్రైండ్ చేసుకోవాలి.
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే!
-ఇప్పుడు అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేయాలి. నూనె కాగాక ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడించాలి. చివరగా కరివేపాకు వేసి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ను అందులో కలపాలి. మంటను చిన్నగా ఉంచి, చట్నీ నుండి నూనె బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి.
-అంతే ఘుమఘుమలాడే మదురై స్టైల్ వెల్లుల్లి చట్నీ రెడీ.
-వేడివేడి ఇడ్లీలు లేదా క్రిస్పీ దోశెలతో దీన్ని తింటుంటే స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ అవుతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
