Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
Thecha recipe: మహారాష్ట్ర స్పెషల్ పచ్చిమిర్చి పచ్చడి..జన్మజన్మలకి గుర్తుండిపోయే టేస్ట్,ఇదిగో రెసిపి
మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా తేచ్చా పచ్చడి తింటారు. తేచ్చా పచ్చడిని పచ్చిమిర్చిలతో చిన్న చిన్న మార్పులు చేసి తయారుచేస్తారు. ఈ తేచ్చాని వేడి వేడి అన్నంతో లేదా రోటీలు లేదా చపాతీలతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. మరాఠీల ఊపిరిగా భావించే ఈ తేచ్చాని మీరు కూడా ఇంట్లో చేసుకువాలనుకుంటున్నారా? దీనిని చేయడం చాలా చాలా సింపుల్. తేచ్చా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తేచ్చా తయారీ విధానం ఇక్కడ చూడండి.
తేచ్చా తయారీకి కావాల్సిన పదార్థాలు
-బజ్జీ మిర్చి
-పల్లీలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-నూనె
-ఉప్పు
తేచ్చా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి దానిమీద 8 బజ్జీ మిర్చిలను తొడిమలు
తీసి ఒక్కో మిర్చీని రెండు మూడు ముక్కలుగా చేసి పెనంమీద వేసి మిర్చిపై
నల్లని మచ్చలు ఏర్పడేంతరవకు కలుపుతూ వేపుకోండి.
ఆంధ్ర స్పెషల్ పండు మిరపకాయల చట్నీ.. టిఫిన్కే కాదు అన్నంలోనూ అదుర్స్!
-మిరపకాయ ముక్కలమీద నల్లగా మచ్చలుగా రావడం ప్రారంభమైనప్పుడు వాటిమీద ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె, పావు కప్పు వేరుశెనగ పప్పు, పొట్టు తీసిన 20-25 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి మంటను సిమ్ లో పెట్టి కలుపుతూ వేయించుకోండి.
-పల్లీలు వేగుతున్న సమయంలోనే వాటిపై తగినంత ఉప్పు చల్లుకోండి.
-పల్లీలు అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీలో లేదా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. రోట్లో వేసి దంచితేనే అసలు సిసలైన తేచ్చా టేస్ట్ వస్తుంది.
-ఈ తేచ్చాని వేడి అన్నంలో లేదా రోటీ,చపాతీల్లో కలిపి తింటే యమా రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








