Latest Updates
-
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.!
సాధారణంగా కేసరి అంటే రవ్వతోనే ఎక్కువగా చేస్తారు. కానీ అటుకులతో ఎప్పుడైనా చేసి చూశారా.. అటుకులు అనగానే పాయసం లేదా ఏవైనా స్నాక్స్ గుర్తొస్తాయి. కానీ ఒక్కసారి ఇలా కేసరి ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ టేస్ట్‌కి ఫిదా అయిపోవాల్సిందే.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తక్కువ పదార్థాలతో సింపుల్‌గా అయిపోయే అటుకుల కేసరిని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి.. మీ పని కూడా సులువుగా అయిపోతుంది. అటుకుల కేసరి ఎలా తయారుచేయాలో చూద్దాం..

అటుకుల కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు
ఎర్ర అటుకులు- 125 గ్రాములు
నెయ్యి- ఆరు టీస్పూన్లు
జీడిపప్పు- 15 పలుకులు
నీళ్లు- రెండు కప్పులు
బెల్లం- 200 గ్రాములు
ఏలకుల పొడి- టీస్పూన్
అటుకుల కేసరి తయారీ విధానం
ముందుగా స్టవ్‌పైన పాన్ పెట్టుకుని ఎర్ర అటుకులను రంగు మారేవరకు దోరగా వేయించాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరి బూరెలు.. అరిసెలను మించే రుచితో.!
ఇప్పుడు అదే పాన్‌లో టీస్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు పలుకులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
అటుకులు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ బౌల్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
స్టవ్‌పైన అదే పాన్‌లో బెల్లం వేసుకుని అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి. చిన్న మంటపైన బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం కరుగుతుండగా రెండు టీస్పూన్ల నెయ్యి వేసుకోవాలి.

ఇప్పుడు ఆ బెల్లం పానకంలో పొడి చేసుకున్న అటుకుల పిండిని వేసుకుని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.
టీస్పూన్ ఏలకుల పొడి అటుకుల పిండి గట్టి పడే వరకు గరిటెతో కలియతిప్పుతూ ఉండాలి. అటుకుల పిండి బెల్లం పానకంలో బాగా ఉడికి దగ్గరికి అవుతూ ఉంటుంది. అడుగు అంటకుండా కలపాలి.
చివరిగా మిగిలిన నెయ్యి, జీడిపప్పు పలుకులు వేసి కలపాలి. కేసరి దగ్గరగా ఉడికిన నెయ్యి పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఆరోగ్యానికి, బలానికి బూస్టింగ్ ఫుడ్.. కమ్మనైన స్వీట్ కొబ్బరి రొట్టె.. రోటీ కంటే హెల్తీగా.!
అంతే రుచికరమైన అటుకుల కేసరి రెడీ.. ఈ స్పెషల్ రెసిపీని తప్పక ట్రై చేయాల్సిందే..
కృష్ణయ్యకి ఎంతో ప్రీతికరమైన ఈ అటుకులతో పాయసమే కాకుండా ఇలా కేసరి కూడా ట్రై చేసి కృష్ణాష్టమి రోజు సైతం నైవేద్యంగా చేసి పెట్టొచ్చు.
ఒక వేళ ఎర్ర అటుకులు మీకు మార్కెట్‌లో దొరక్కపోతే ఇంట్లో వాడుకునే తెల్ల అటుకులతో అయినా ట్రై చేయవచ్చు. అయితే పలుచటి అటుకులు కాకుండా మందపాటి అటుకులతో ఈ స్పెషల్ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. ఈ అమోఘమైన రుచిని ఎప్పటికీ మరిచిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
