Latest Updates
-
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.?
ఆరోగ్యానికి, బలానికి బూస్టింగ్ ఫుడ్.. కమ్మనైన స్వీట్ కొబ్బరి రొట్టె.. రోటీ కంటే హెల్తీగా.!
మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ చాలా పెరిగింది. అందుకే ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇస్తూ హెల్తీ వెరైటీలు చేసుకుని తింటున్నారు. అలాంటి వారి కోసం పచ్చికొబ్బరితో ఎంతో టేస్టీగా చేసే ఈ రొట్టె ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తుంది. పచ్చి కొబ్బరిలోని పోషకాలు తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు త్వరగా అరిగి జీర్ణక్రియకు దోహదపడుతుంది. పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా తినాల్సిన ఈ కొబ్బరి రొట్టెను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

కొబ్బరి రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం- కప్పు
పచ్చి శనగపప్పు- రెండు టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి- కప్పు
బెల్లం- కప్పు
నీళ్లు- రెండు కప్పులు
ఉప్పు- పావు టీస్పూన్
ఏలకుల పొడి- అర టీస్పూన్
నెయ్యి- నాలుగు టీస్పూన్లు
కొబ్బరి రొట్టె తయారీ విధానం
ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు.. ఇడ్లీలు, దోశలు ఎన్ని తింటారో లెక్కే ఉండదు!
ముందుగా ఒక బౌల్‌లో బియ్యం తీసుకుని రెండు సార్లు కడిగి నీళ్లు పారబోయాలి. ఈ బియ్యాన్ని ఒక వెడల్పాటి బౌల్‌లోకి తీసుకుని పదినిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి.
ఒక చిన్న బౌల్‌లో పచ్చిశనగపప్పు తీసుకుని 20 నిమిషాల పాటు నాననివ్వాలి.

ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ బౌల్‌లోకి తీసుకుని రుబ్బుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యాన్ని కూడా మిక్సీ బౌల్‌లోకి తీసుకుని అరిసెల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన ఒక పాన్ తీసుకుని అందులో బెల్లం వేసి, రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కల మిశ్రమాన్ని బెల్లం కరిగేవరకు కలియతిప్పాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి.
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.!
బెల్లం కరిగిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉప్పు, ఏలకుల పొడి వేసి అడుగంటే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

స్టవ్‌పైన వెడల్పాటి మందపాటి పాన్ పెట్టుకుని వేడయ్యాక.. టీస్పూన్ నెయ్యి వేసి కాగనివ్వాలి. కాగిన తర్వాత మరో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి పాన్ పైన వెడల్పుగా పరుచుకోవాలి.
నెయ్యి కాగిన తర్వాత పిండి మిశ్రమం మొత్తం తీసుకుని పాన్‌లో మందంగా పరుచుకోవాలి. గరిటెతో స్మూత్‌గా వెడల్పు చేస్తూ రొట్టెలాగా పరిచిన తర్వాత మూత పెట్టుకోవాలి. మీడియం మంటపైన కాల్చుకోవాలి.
అంచుల వెంబడి నెయ్యి తేలుతూ రొట్టెలోకి పీల్చుకుంటుంది. ఇప్పుడు మూత తీసి రెండో వైపు కూడా మిగిలిన నెయ్యి వేసి అదేవిధంగా కాల్చుకోవాలి. మీడియం మంటపైన ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉంచాలి.
రొట్టె బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.. బియ్యం పిండి, పచ్చి కొబ్బరి, బెల్లం మిశ్రమంతో చేసే ఈ రొట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని ఇస్తుంది. పిల్లలకు, పెద్దలకు బలం కోసం తరచుగా పెట్టాల్సిన స్పెషల్ ఫుడ్ ఇది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
