Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి తక్కువ సమయంలో ఏం చేయాలో తోచక చాలామంది బ్రెడ్, జామ్ లేదా శాండ్ విచ్ వంటి వాటితో సరిపెట్టుకుంటారు. కానీ రోజూ ఇలాంటివి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సమయం తక్కువగా ఉన్నా సరే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం త్వరగా తయారయ్యే, రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్ ఫాస్ట్ పెసరపప్పు ఇడ్లీ.

పెసరపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పొట్టకు చాలా తేలికగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. రోజూ ఒకే రకమైన బ్రేక్ ఫాస్ట్ తిని విసుగొచ్చిన వారికి ఇది ఒక పర్ఫెక్ట్ వంటకం. నోరూరించే ఈ పెసరపప్పు ఇడ్లీని చాలా సాఫ్ట్ గా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
మెత్తని పెసరపప్పు ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
పొట్టు తీసిన పెసరపప్పు - 1 కప్పు
పెరుగు - అర కప్పు
బొంబాయి రవ్వ (సూజీ) - పావు కప్పు
పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ - 1 టీస్పూన్
ఈనో ఫ్రూట్ సాల్ట్ లేదా బేకింగ్ సోడా - 1 టీస్పూన్
ఉప్పు -తగినంత
కొత్తిమీర - 2 టీస్పూన్లు
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 7 ఆకులు
మెత్తని పెసరపప్పు ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా 1 కప్పు పెసరపప్పుని కనీసం 2 గంటల పాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత నానబెట్టిన పెసరపప్పులో ఉన్న నీటిని పూర్తిగా వంపేయాలి. ఆ పప్పును మిక్సీ జార్ లో వేసి అందులోనే పెరుగు, పచ్చిమిర్చి-అల్లం పేస్ట్ వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు అస్సలు కలపకూడదు.
-మెత్తగా రుబ్బుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ ఇడ్లీకి మృదువైన ఆకృతిని ఇస్తుంది. రవ్వ కాస్త ఉబ్బడం కోసం గిన్నెపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇడ్లీకి అసలైన రుచి తాలింపుతోనే వస్తుంది. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, శనగపప్పు వేసి దోరగా వేయించండి. చివరగా కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. దీనిని పెసరపప్పు పిండిలో వేసి నెమ్మదిగా కలపండి.
-ఇప్పుడు ఇడ్లీ పాత్రలో తగినన్ని నీళ్లు పోసి వేడి చేయండి. ఇడ్లీ అచ్చులకు కొద్దిగా నూనె రాసి సిద్ధంగా ఉంచుకోండి. పిండిలో ఈనో లేదా బేకింగ్ సోడా వేసి, దానిపై ఒక చెంచా నీళ్లు చల్లండి. పిండి బుడగల్లా పొంగుతుంది. ఇప్పుడు పిండిని సున్నితంగా కలపాలి.
-వెంటనే ఆ పిండిని ఇడ్లీ అచ్చులలో వేసి 10 నుంచి 12 నిమిషాల పాటు అధిక మంట మీద ఆవిరిపై ఉడికించండి.
-అంతే ఎంతో మృదువైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు ఇడ్లీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications