Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ..దోసెలు,ఇడ్లీలు ఎన్ని తింటారో మీకే తెలీదు!
మనందరి ఇళ్లలో ఉదయం అల్పాహారం బ్రేక్ ఫాస్ట్ అనగానే టక్కున గుర్తొచ్చేది ఇడ్లీ,దోసె. అయితే వాటికి కాంబినేషన్‌గా రోజూ తినే కొబ్బరి చట్నీ లేదా రొటీన్ టమాటా పచ్చడి తిని మీకు బోర్ కొట్టిందా? అయితే తోపుడు బండి దగ్గర దొరికే అత్యంత రుచికరమైన పుదీనా కొత్తిమీర చట్నీని మీ వంటగదిలో ట్రై చేయండి. ఈ చట్నీని ఒక్కసారి రుచి చూశారంటే.. మీ ఇంట్లో వాళ్ళు ఇడ్లీలు ఎన్ని తింటున్నారో లెక్కపెట్టుకోవడం మీ వల్ల కాదు.. అంత అద్భుతంగా ఉంటుంది.

పుదీనా కొత్తిమీర చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
వంట నూనె(నువ్వుల నూనె బెటర్)- 3 టేబుల్ స్పూన్లు
పల్లీలు- 1 టేబుల్ స్పూన్
మినప పప్పు - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 8
అల్లం - అర అంగుళం
ఎండు మిరపకాయలు - 3
పచ్చి మిరపకాయ - 1
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 3
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
కాశ్మీరీ ఎర్ర కారం- అర టీస్పూన్
పుదీనా ఆకులు - ఒక గుప్పెడు
కొత్తిమీర - సగం గుప్పెడు
కరివేపాకు - 2 రెమ్మలు
ఉప్పు - మీ రుచికి తగినంత
ఆవాలు - 1 టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
పుదీనా కొత్తిమీర చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక పల్లీలు, మినప పప్పు వేసి సన్నని మంటపై దోరగా వేయించుకోండి.
-పప్పులు కాస్త రంగు మారాక..అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయను వేసి బాగా వేయించండి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇవి త్వరగా మగ్గడానికి ఉప్పును ఇప్పుడే చల్లుకోండి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక, తరిగిన టమాటా ముక్కలు, చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, కశ్మీరీ కారం వేసి బాగా కలపండి. టమాటాలు మెత్తగా గుజ్జులా మారే వరకు ఉడికించి స్టవ్ ఆర్పేయండి.
-స్టవ్ ఆర్పేసిన వెంటనే, ఆ వేడి పాన్ లోనే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఆకులను వేసి ఒకసారి కలపండి. ఆకులను ఉడికించకూడదు, ఆ వేడికి అవి మగ్గితే చాలు. అప్పుడే చట్నీకి మంచి పచ్చటి రంగు, తాజా సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చట్నీలా మెత్తగా రుబ్బుకోండి.
-చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి మిగిలిన నూనె వేయండి. నూనె కాగాక ఆవాలు, మినపపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడించండి. ఈ కమ్మటి పోపును ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీలో వేసి బాగా కలపండి. కావాలంటే మరికాస్త నీరు కలుపుకుని ఉడికించుకోవచ్చు.
-అంతే గుమగుమలాడే తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ. వేడివేడి ఇడ్లీల పైన లేదా నెయ్యి దోసె పైన ఈ చట్నీని వేసుకుని తింటుంటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications