చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే, కీళ్ల నొప్పులు పోగొట్టే మునగాకు డ్రై ఫ్రూట్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

చలికాలం అడుగుపెట్టిందంటే చాలు, చల్లని గాలులతో పాటు బద్ధకం, నీరసం, కీళ్ల నొప్పులు, వాతావరణ సంబంధిత అనారోగ్యాల ముప్పు కూడా పెరుగుతాయి. అందుకే ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతూ, రోగనిరోధక శక్తిని పెంచి, రోజంతా ఉత్సాహంగా ఉంచే సరైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.

భారతీయ వంటశాలల్లో శీతాకాలపు లడ్డూలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చలికాలంలో మీరు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే, శీతాకాలపు సూపర్ ఫుడ్‌ గా పిలిచే మునగ డ్రై ఫ్రూట్ లడ్డూలను తప్పక ప్రయత్నించండి. మునగ డ్రై ఫ్రూట్ లడ్డూలు మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Moringa Dry Fruit Ladoo Recipe in Telugu Ultimate Winter Superfood for Immunity

కావాల్సిన పదార్థాలు

మునగ పొడి: 3 నుండి 4 టేబుల్ స్పూన్లు
బాదం: అర కప్పు
వాల్‌నట్స్: అర కప్పు
జీడిపప్పు: 1/3 కప్పు
పిస్తా పప్పులు: 2 టేబుల్ స్పూన్లు
గుమ్మడికాయ లేదా పొద్దుతిరుగుడు గింజలు: 2 టేబుల్ స్పూన్లు
తురిమిన ఎండు కొబ్బరి: అర కప్పు
బెల్లం లేదా గింజలు తీసిన ఖర్జూరాలు: 3/4 కప్పు
నెయ్యి: 3 నుండి 4 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: అర టీస్పూన్
సొంఠి పొడి: పావు టీస్పూన్

బరువు తగ్గించే రుచికరమైన ఓట్స్ ఉప్మా.. 10 నిమిషాల్లో రెడీ చేసుకోండిలా..

తయారీ విధానం

-ముందుగా మందపాటి అడుగు ఉన్న పాన్‌ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేయండి. నెయ్యి వేడెక్కాక బాదం, వాల్‌ నట్స్, జీడిపప్పు, పిస్తా, గింజలను వేసి తక్కువ మంటపై 2-3 నిమిషాలు తేలికగా వేయించండి. కమ్మని వాసన వచ్చాక వీటిని ఒక ప్లేట్‌ లోకి తీసి పక్కన పెట్టుకోండి.

-అదే బాండీలో తురిమిన ఎండు కొబ్బరిని వేసి, తేలికపాటి సువాసన వచ్చేవరకు 1 నిమిషం పాటు వేయించి బయటకు తీయండి.

-ఇప్పుడు బాండీలో మిగిలిన నెయ్యిని వేసి మంటను పూర్తిగా తగ్గించండి. అందులో మునగ పొడిని వేసి కేవలం 30-45 సెకన్ల పాటు మాత్రమే వేయించండి. మునగ పొడిని ఎక్కువ సేపు లేదా పెద్ద మంటపై వేయిస్తే చేదు రుచి రావడమే కాకుండా, పోషకాలు కూడా నశిస్తాయి. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించండి.

-తర్వాత వేరొక బాండీలో కొద్దిగా నెయ్యి వేసి, తరిగిన బెల్లం లేదా ఖర్జూరాలను తక్కువ మంటపై మెత్తబడే వరకు కరిగించుకోండి.

-ఒక పెద్ద గిన్నెలో వేయించిన నట్స్, కొబ్బరి, మునగ మిశ్రమం, యాలకుల పొడి, శొంఠి పొడి వేసి బాగా కలపండి. ఇందులో మెత్తబడిన బెల్లం లేదా ఖర్జూరాలను వేసి అంతా కలిసేలా మిక్స్ చేయండి.

-మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే, చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని గుండ్రని లడ్డూలుగా తయారుచేయండి.

-అంతే పోషకాలు పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన మునగ డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుని రోజూ ఒక లడ్డూ తింటే, ఈ శీతాకాలమంతా అలసట లేకుండా ఎంతో శక్తివంతంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.

[ of 5 - Users]
Story first published: Thursday, November 26, 2026, 12:52 [IST]
Desktop Bottom Promotion