Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రోడ్ల మీద బండ్ల దగ్గరే అమ్మే ముంతమసాలా..దాన్ని మించిన టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమైన వంటకం ముంత మసాలా. ఇది రుచికరమైన, కారంగా ఉండే పౌష్టిక పదార్థాలతో తయారుచేయబడిన ఒక ఆరోగ్యకరమైన స్నాక్. బఠానీలు, కూరగాయలు,రకరకాల సుగంధ ద్రవ్యాలతో తయారుచేయబడిన ఈ వంటకం చాలా తక్కువ సమయంలో చేయవచ్చు. ముంత మసాలా కేవలం రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని ఇంట్లో తయారుచేసుకోవడం చాలా సులభం. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పిల్లలకు, పెద్దలకు ఒక ఆరోగ్యకరమైన స్నాక్ గా దీనిని ఇవ్వవచ్చు. రోడ్ల మీద బండ్ల దగ్గర తినే ముంతమసాలాను అదే టేస్ట్ వచ్చేలా హైజీనిక్ గా ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ముంతమసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
-మరమరాలు
-ఆయిల్
-వేరుశెనగపప్పు
-కార్న్ ఫ్లేక్స్
-ఉల్లిపాయ
-టమాటో
-జీలకర్ర పొడి
-ధనియాల పొడి
-నిమ్మరసం
-చాట్ మసాలా
-ఉప్పు
-నెయ్యి
-కారం
-చాట్ మసాలా
-పచ్చిమిరపకాయ
-కొత్తిమీర

ముంతమసాలా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 కప్పుల మరమరాలు వేసి మీడియం మంట మీద 2 నిమిషాలు వేయించుకోవాలి.
-తర్వాత అదే కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడెక్కాక అందులో అరకప్పు కార్న్ ఫ్లేక్స్ వేసి వేయించుకోవాలి.
తర్వాత అదే నూనెలో పావుకప్పు వేరుశెనగపప్పును అదే నూనెలో వేసి మాడిపోకుండా వేసి కలుపుతూ వేయించుకోవాలి.
ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో వేయించిన మరమరాలు, వేయించిన కార్న్ ఫ్లేక్స్ వేసి వీటిని చేత్తో ప్రెస్ చేసుకోవాలి.
ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటో ముక్కలు, చాలా సన్నగా కట్ చేసిన 1 పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, 1 స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, పులుపుని బట్టి నిమ్మరసం, వేయించిన పల్లీలు వేసి మొత్తం బాగా కలిసేలా చేత్తో కలపాలి. కావాలనుకుంటే ఇందులోనే మిరపకయ బజ్జీ లేదా టమాటా బజ్జీ అయినా కట్ చేసి వేసుకోవచ్చు. అంతే ముంతమసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
