తల్లి ప్రేమను మించిన రుచి..ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఇలా చేసుకోండి..అన్నం,టిఫిన్స్ లోకి 2 నెలలు సెట్

Posted By:

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత ఉంది. మనం చేసుకునే దాదాపు అన్నికూరల్లో ఉల్లిపాయలను వాడుతుంటాం. అయితే అదే ఉల్లిపాయతో పచ్చడి చేస్తే? ఊహిస్తేనే నోరూరిపోతుంది కదూ. సరైన కొలతలతో, శుభ్రమైన పద్ధతిలో తయారుచేస్తే ఉల్లిపాయ పచ్చడి 3 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీ వంటి అనేక రకాల ఆహారాలతో అద్భుతంగా ఉంటుంది. దీనిని తయారుచేయడం కూడా చాలా ఈజీ. ఉల్లిపాయ నిల్వ పచ్చడి తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఉల్లిపాయ నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

-ఉల్లిపాయలు
-జీలకర్ర
-ధనియాలు
-కారం
-వెల్లుల్లి రెబ్బలు
-చింతపండు
-ఉప్పు
-పసుపు
-కరివేపాకు
-ఆవాలు
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-ఎండుమిరపకాయలు

Mouth Watering Onion Storage Pickle Your New Favorite Side Dish Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా 5 ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా అరగంట సేపు ఆరబెట్టి తర్వాత పొడవుగా, స్లైసెస్ లాగా కట్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి అందులో3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి సగం వరకు వేగాక ఇందులోనే జీలకర్ర వేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు వేయించాక ధనియాలు,జీలకర్రను ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లోనే పావు కప్పు నూనె వేసి వేడి చేశాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టీస్పూన్ ఉప్పు కూడా వేసి మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి.

-ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక ఇందులో 50 గ్రాముల చింతపండు వేసి తక్కువ మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ 5 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరికొంత రంగుమారి, చింతపండు మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించిన ఉల్లిపాయల్లో ఒక గిరిటెడు ఉల్లిపాయలను చింతపండు లేకుండా తీసి పక్కన పెట్టుకోండి.

Mouth Watering Onion Storage Pickle Your New Favorite Side Dish Recipe in Telugu

-తర్వాత మిక్సీ గిన్నెలో వేయించిన ధనియాలు, జీలకర్ర వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే పక్కన పెట్టుకోగా మిగిలిన వేయించిన ఉల్లిపాయలు,చింతపండును ధనియాలు జీలకర్ర పొడి ఉన్న మిక్సీ గిన్నెలోనే వేసి,ఇందులోనే పావు కప్పు పొట్టు తీసిన పెద్ద వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే 50గ్రాముల కారం, 30 గ్రాముల ఉప్పు వేసి స్పూన్ తో కలిపి మధ్యమధ్యలో ఆపుకుంటూ మెత్తం కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇాందులోనే పక్కకు తీసి పెట్టుకున్న వేయించిన ఉల్లిపాయలు వేసి కలిపి పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పేస్ట్ అవ్వకూడదు,తినేటప్పుడు మధ్యమధ్యలో తగులుతూ ఉండాలి.

-ఈ పచ్చడికి పోపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ముప్పావు కప్పు నువ్వుల నూనె పోసి కాగాక ఇందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి వేయించాక కొన్ని చిన్న పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు తుంపి వేసి వేసి ఇవి వేగాకా పసుపు, కరివేపాకు వేసి వేయించాక స్టవ్ ఆప్ చేసేసి తాళింపులో గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పచ్చడిని మొత్తం వేసి కలుపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ ఉల్లిపాయ పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion