విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా

Posted By:

వందల రోగాలను నయం చేసే శక్తి మనగాకుకి ఉందని చెబుతుంటారు నిపుణులు. విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉండే మునగాకును తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధులను తరిమికొట్టవచ్చని చెబుతుంటారు. మునగాకుతో అనేక రకాల వంటకాలు,స్వీట్లు తయారుచేసుకుంటారు. మన ప్రధాని మోదీ కూడా మునగాకుతో చేసే పరాఠాను తన ఆహారంలో చేర్చుకుంటారు.

అయితే మునగాకుతో రెగ్యులర్ వంటకాలు కాకుండా ఒకసారి తొక్కు(పచ్చడి) చేసి చూడండి..అద్భుతంగా ఉంటుంది. కమ్మగా, కాస్త కారంగా, పుల్లపుల్లగా ఉండే ఈ మునగాకు తొక్కు వేడి అన్నం, ఇడ్లీ, దోశ లేదా చపాతీ... దేనిలోకైనా అద్భుతంగా సరిపోతుంది.

munagaku thokku recipe in telugu how to make iron vitamins packed moringa thokku

మునగాకు తొక్కు తయారీకి కావాల్సిన పదార్థాలు

లేత మునగాకు
సాంబార్ ఉల్లిపాయలు
వెల్లుల్లి రెబ్బలు
జీలకర్ర - 1 టీస్పూన్
కారం - మీ రుచికి సరిపడా
కాశ్మీరీ ఎర్ర కారం - కొద్దిగా
నువ్వుల నూనె - తగినంత
ఆవాలు - 1 టీస్పూన్
పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఎండుమిర్చి - 2 లేదా 3
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
చింతపండు రసం - కొద్దిగా

పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..

మునగాకు తొక్కు తయారీ విధానం

-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న ఉల్లిపాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సాధారణ కారం, మంచి రంగు కోసం కాశ్మీరీ కారం వేయాలి. వీటన్నింటినీ మెత్తని పేస్ట్‌ లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. అందులో కొద్దిగా నువ్వుల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, పచ్చి శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అలాగే ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువగానే వేసి దోరగా వేయించుకోవాలి.

-తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ-కారం పేస్ట్‌ ను వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలపాలి. మంటను మీడియంలో ఉంచి, ఈ మిశ్రమం పచ్చివాసన పోయి, నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించాలి.

-మసాలా చక్కగా వేగిన తర్వాత, ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న లేత మునగాకును అందులో వేయాలి. మునగాకు మెత్తబడి, మసాలాతో కలిసేలా సుమారు 5 నిమిషాల పాటు సన్నని మంటపై మగ్గనివ్వాలి.

-మునగాకు మగ్గిన తర్వాత, చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోయాలి. అంతా ఒకసారి బాగా కలుపుకుని, మరో 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. పచ్చడి దగ్గరపడి, అంచుల వెంట నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే మునగాకు తొక్కు రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, September 18, 2026, 17:28 [IST]
Desktop Bottom Promotion