లంచ్‌ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్‌’.. ముస్లిం వెడ్డింగ్‌ స్టైల్‌లో ఇలా చేసేయండి.!

ముస్లిం పండుగల్లో ప్రత్యేకంగా అట్రాక్ట్‌ చేసేవి నోరూరించే వంటకాలు. హలీమ్‌, బిర్యానీ, ఖీర్‌ ఇలా ఎన్నో రకాల స్పెషల్‌ రెసిపీస్‌ కనువిందు చేయడమే కాదు కడుపు నిండుగా తినేలా చేస్తాయి. అలాంటి వాటిలో గీ రైస్‌ ఒకటి. ముస్లిం పెళ్లిళ్లలో ఈ గీ రైస్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే.. గీ రైస్‌ను చాలా సింపుల్‌గా ఇంట్లో కూడా రుచికరంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం టైం లేనప్పుడు లంచ్‌ బాక్స్‌లోకి ఈ రెసిపీని హడావుడి లేకుండా రెడీ అయిపోతుంది. ముస్లిం వెడ్డింగ్‌ స్టైల్‌ గీ రైస్‌ ఎలా తయారుచేయాలో చూద్దాం..

Muslim wedding style ghee rice for lunch box quick and easy process

ముస్లిం వెడ్డింగ్‌ స్టైల్‌ గీ రైస్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం- కప్పు
నెయ్యి- మూడు టేబుల్‌ స్పూన్లు
కొబ్బరి నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
మసాలా దినుసులు- టేబుల్‌ స్పూన్‌
ఉల్లిపాయలు- రెండు
జీడిపప్పులు- పది
పచ్చిమిర్చి- నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌
పుదీనా- గుప్పెడు
కొత్తిమీర- గుప్పెడు
ఉప్పు- టీస్పూన్‌
టమాటా- ఒకటి
నీళ్లు- ఒకటి ముప్పావు కప్పు

ముస్లిం వెడ్డింగ్‌ స్టైల్‌ గీ రైస్‌ తయారీ విధానం

ముందుగా బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి ఒక వెడల్పాటి బౌల్‌లో 30 నిమిషాల పాటు నాననివ్వాలి.

మహిళల్లో పీరియడ్స్‌, ఫిట్‌నెస్‌ సమస్యలకు చెక్‌ పెట్టే ప్రొటీన్‌ పౌడర్‌.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి

ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరిగాక, కొబ్బరి నూనె వేసుకోవాలి. వేడయిన తర్వాత మసాలా దినుసులు (దాల్చిన చెక్క, జాపత్తి, మరాఠీ మొగ్గ, స్టార్‌ పువ్వు, లవంగాలు(ఐదు), ఏలకులు(3), జాపత్రి, బిర్యానీ ఆకు) వేసి వేగనివ్వాలి.

Muslim wedding style ghee rice for lunch box quick and easy process

సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి.

తర్వాత తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపాక చిన్నగా కట్‌ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

Muslim wedding style ghee rice for lunch box quick and easy process

ఇప్పుడు ఒక గ్లాసుతో పాటు ముప్పావు కప్పు నీళ్లు(ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి) పోసి మరిగించాలి. నిమిషం పాటు మరిగిన తర్వాత మంట చిన్నగా పెట్టుకోవాలి.

ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని తీసుకుని మరుగుతున్న ఎసరులో వేసుకుని కలిపి మీడియం మంటపైన పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గీ రైస్‌ దగ్గరికి అవుతున్నప్పుడు మంటి చిన్నగా పెట్టి ఎసరు మొత్తం పీల్చుకునే వరకు ఉంచాలి.

శ్రావణ మాసం స్పెషల్‌.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.!

గీ రైస్‌ పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. టేస్టీ ముస్లిం వెడ్డింగ్‌ స్టైల్‌ గీ రైస్‌ రెడీ.

ఈ స్పెషల్‌ రెసిపీ లంచ్‌ బాక్స్‌లోకి ఈజీగా సర్వ్‌ చేసుకోవచ్చు. ఏదైనా గ్రేవీ లేదా రైతాతో ఈ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, August 21, 2026, 18:21 [IST]
q
Desktop Bottom Promotion