నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్‌నెస్‌ ప్రియులకు పర్ఫెక్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌.!

నల్ల శనగలతో మన శరీరానికి ఎన్నో బెనిఫిట్స్‌ ఉన్నాయి. అందుకే పూజలు, ఇతర కార్యక్రమాల్లో ఈ నల్ల శనగలను తప్పకుండా పెడతారు. 7 గంటలపైనే బాగా నానబెట్టి తాలింపు వేసుకుని తింటుంటే ఆ రుచికి ఏ స్నాక్స్ పనికిరావు అనిపిస్తుంది. వీటిలోని హై ప్రొటీన్‌ ఫిట్‌గా ఉంచడంతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను సైతం నియంత్రణలో ఉంచుతుంది. మరి ఈ శనగలతో దోశ చేసుకుని తింటే చిన్నాపెద్దా లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఈ హై ప్రొటీన్‌ శనగల దోశను ఎలా తయారుచేయాలో చూద్దాం..

nalla senagala dosa with high protein no need to ferment overnight healthy breakfast

నల్ల శనగల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు

నల్ల శనగలు- పావు కేజీ
పచ్చిమిర్చి- రెండు
మిరియాలు- అర టీస్పూన్‌
అల్లం- నాలుగు చిన్న ముక్కలు
కరివేపాకు- మూడు రెబ్బలు
కొత్తిమీర- గుప్పెడు
బొంబాయి రవ్వ- పావు కేజీ
పెరుగు- పావు కేజీ
ఉప్పు- టీస్పూన్‌
నీళ్లు- సరిపడా

నల్ల శనగల దోశ తయారీ విధానం

నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్‌ స్టైల్‌ మజ్జిగ పులుసు.!

ముందుగా పాపు కేజీ నల్ల శనగలను తీసుకుని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ టైంలో నీళ్లను తీసేసి ఉబ్బిన శనగలను మిక్సీ జార్‌లో వేసుకుని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు ఒక్కొక్కటిగా వేసి అర కప్పు నీళ్లు పోసి దోశ పిండి మాదిరిగా నీళ్లు పోసుకోవాలి.

nalla senagala dosa with high protein no need to ferment overnight healthy breakfast

తర్వాత బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని అవసరమైతే దోశ పిండికి కావాల్సిన విధంగా నీళ్లు పోసి గరిటెతో కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పెనం పెట్టుకుని సాధారణ దోశల మాదిరిగానే పోసుకుని కాస్త నెయ్యి చల్లి రెండు వైపులా కాల్చుకోండి. అంతే క్రిస్పీ అండ్‌ సాఫ్ట్‌ హై ప్రొటీన్‌ దోశలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీతో తింటే ఎన్ని తింటున్నామో కూడా గుర్తుండదు. అంతలా వీటి రుచి ఉంటుంది.

మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.!

టిఫిన్స్‌లోకి ఏమీ లేనప్పుడు శనగలు ఉంటే వాటితో ఇలా హెల్తీగా దోశలు చేయడం బెస్ట్ ఆప్షన్‌. నల్ల శనగలతో డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగించి త్వరగా ఆకలి వేయకుండా బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ప్రొటీన్‌, ఐరన్‌, విటమిన్స్‌ పుష్కలంగా ఉండటంతో శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను బలోపేతం చేస్తుంది. దీంతో నల్ల శనగల దోశలను తరచూ తీసుకోవడం వల్ల సీజనల్‌ వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడుకోవచ్చు.

[ of 5 - Users]
Story first published: Saturday, September 19, 2026, 6:57 [IST]
Desktop Bottom Promotion