Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.!
మజ్జిగ చారు అనగానే పెరుగును మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసి తాలింపు వేసి రుచికరంగా చేసుకుంటాం. కానీ వీటిలో ఎప్పుడైనా బంగాళాదుంపలు వేసి ట్రై చేశారా.. దీనినే నేపాలీ చుకౌనీ అంటారు. పప్పు, సాంబారు, ఇతర గ్రేవీ కర్రీల్లోకి, వేపుడు కూరల్లోకి ఇది సైడ్ డిష్‌గా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వంటకాన్ని ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. చాలా సింపుల్‌గా ఆయిపోయే ఈ రెసిపీని తప్పక ట్రై చేయాల్సిందే..

బంగాళాదుంప మజ్జిగ చారు తయారీకి కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు- రెండు(పెద్ద సైజు)
ఉప్పు- పావు టీస్పూన్
పెరుగు- 400 గ్రాములు
జీలకర్ర పొడి- టీస్పూన్
కశ్మీరీ కారం- టీస్పూన్
నల్ల ఉప్పు- టీస్పూన్
ఉల్లిపాయలు- ఒకటి
కొత్తిమీర- గుప్పెడు
బంగాళాదుంప మజ్జిగ చారులో తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు
ఆవ నూనె- టేబుల్ స్పూన్
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
పచ్చిమిర్చి- ఒకటి
కసూరి మెంతి- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
కారం- పావు టీస్పూన్
బంగాళాదుంప మజ్జిగ చారు తయారీ విధానం
ముందుగా బంగాళాదుంపలను చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని పది నిమిషాల పాటు మీడియం మంటపైన ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు పావు టీస్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత నీటిని తీసేసి వెడల్పాటి బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.!
ఇప్పుడు 400 గ్రాముల పెరుగు తీసుకుని దానిని బాగా గిలక్కొట్టి ఉండలు, గడ్డలు లేకుండా చేసుకోవాలి.

ఈ పెరుగులో ఉడికించిన బంగాళాదుంప ముక్కలను వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, కశ్మీరీ కారం, నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
కారం లేకుండానే ఘాటుఘాటు రుచితో వైట్ మటన్ పులావ్.. మసాలా నషాళానికి అంటాల్సిందే.!
ఇప్పుడు మజ్జిగ చారులో తాలింపు కోసం స్టవ్‌పైన చిన్న బాణలి పెట్టుకోవాలి. ఆవ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్నగా గుండ్రంగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కసూరి మెంతి, పసుపు, కారం వేసుకుని కలుపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ తాలింపును బంగాళాదుంప, పెరుగు మిశ్రమంలో వేసి కలపాలి. అంతే ఎంతో సింపుల్‌గా ఎవర్గ్రీన్ సైడ్ డిష్ బంగాళాదుంప మజ్జిగ చారు రెడీ. కూరలేవీ లేకపోయినా వైట్ రైస్‌లోకి ఈ రెసిపీ కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
