Latest Updates
-
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్‌విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.!
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.!
చికెన్ అనగానే ఎన్నో రకాల వెరైటీలు గుర్తొస్తాయి. చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ మంచూరియా, చికెన్ పిజ్జా ఎలా ఇన్నో. కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా పాన్ కేక్‌ల ట్రెండ్ నడుస్తోంది. వివిధ రకాల ఫ్లేవర్స్‌తో పాన్ కేక్‌లు నోరూరిస్తుంటాయి. చికెన్‌తో కూడా స్పైసీ, క్రంచీ పాన్ కేక్‌ను చేసుకోవచ్చు. చూడగానే పిజ్జాను తలపించేలా నోరూరించే చికెన్ పాన్ కేక్‌ను ఈ సండే స్నాక్స్‌లో తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే..

చికెన్ పాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్- 300 గ్రాములు
కోడిగుడ్లు- మూడు
ఉప్పు- ఒకటిన్నర టీస్పూన్
మిరియాల పొడి- టీస్పూన్
సోయాసాస్- రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి- రెండు
ఉల్లిపాయ- ఒకటి
క్యారెట్- రెండు
క్యాప్సికం- ఒకటి
ఉల్లికాడలు- కప్పు
కార్న్ ఫ్లోర్- మూడు టేబుల్
స్పూన్లు
బియ్యం పిండి- మూడు టేబుల్ స్పూన్లు
చికెన్ పాన్ కేక్ తయారీ విధానం
ముందుగా బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన ఒక వెడల్పాటి బౌల్‌లో వేసుకోవాలి.
ఇప్పుడు ముడు గుడ్లను తీసుకుని ఒక బౌల్‌లో పగలగొట్టి బాగా గిలక్కొట్టాలి.

తర్వాత చికెన్ ముక్కల్లో ఉప్పు, నల్ల మిరియాల పొడి, సోయాసాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా గుండ్రంగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికం ముక్కలను వేసి కలుపుకోవాలి.
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్‌విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.!
తర్వాత ఉల్లికాడలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేసి మొత్తం కలగలుపుకోవాలి.
చివరిగా గిలక్కొట్టిన గుడ్లను వేసి స్పూన్‌తో బాగా కలియతిప్పుకోవాలి. తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా గుడ్లలోని రసం చికెన్ ముక్కలకు బాగా పడుతుంది.

పదిహేను నిమిషాల తర్వాత స్టవ్‌పైన తవా పెట్టుకుని అందులో అర టీస్పూన్ నూనె వేసుకుని దాని చుట్టూ అప్లై చేసుకోవాలి.
వేడయ్యాక చికెన్ మిశ్రమాన్ని గరిటంతో దోశ మాదిరిగా పెనం చుట్టూ అప్లై చేసుకోవాలి. మూత పెట్టుకుని మీడియం మంటపైన 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.!
ఇప్పుడు మూత తీసి రెండో వైపు కూడా అదేమాదిరిగా కాల్చుకోవాలి. మిగతా చికెన్ మిశ్రమాన్ని కూడా నూనె అప్లై చేసుకుని పాన్ కేక్‌లు వేసుకోవాలి.
టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పాన్ కేక్స్ రెడీ. చూడగానే పిజ్జాలను తలపించే వీటి రుచి వాటికి మించి ఉంటుంది. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుని టమాటా సాస్‌తో తింటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications