Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
గ్యాస్ కొరత, సిలిండర్ల ధరల పెంపు అనేది ప్రస్తుతం సామాన్యులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. గ్యాస్ లేక ఇప్పటికే ఎన్నో చిన్న, పెద్ద హోటళ్లు మూతపడ్డాయి. రాబోయే రోజుల్లో గృహ వినియోగదారులకు సైతం గ్యాస్ కష్టాలు తప్పకపోవచ్చనే ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ లేకపోతే ఇంట్లో వంట ఎలా? అని టెన్షన్ పడుతున్నారా? అయితే మీకో అద్భుతమైన గుడ్ న్యూస్.
పొయ్యి వెలిగించే పనే లేకుండా, అసలు నూనె చుక్క కూడా వాడకుండా ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలు చేసుకోవచ్చు. ముఖ్యంగా అందరికీ ఇష్టమైన వేడివేడి ఇడ్లీని సైతం గ్యాస్ స్టవ్ అవసరం లేకుండానే తయారు చేయొచ్చంటే నమ్ముతారా? అవును నో బాయిల్ - నో ఆయిల్ కాన్సెప్ట్ తో ఇడ్లీ, దానికి అదిరిపోయే స్పెషల్ చట్నీ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

పొయ్యి అక్కర్లేని ఇడ్లీ, చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ కోసం:
అటుకులు (మందపాటివి) - 1 కప్పు
కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
చట్నీ కోసం:
పచ్చి కొబ్బరి ముక్కలు - పావు కప్పు
సాంబార్ ఉల్లిపాయలు - 20
ఎండు మిరపకాయలు - 4
టమాటా - 1
బెల్లం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
పొయ్యి అక్కర్లేని ఇడ్లీ, చట్నీ తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకుని శుభ్రం చేసి, మిక్సీ జార్ లో వేసి మెత్తటి రవ్వలా లేదా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సాధారణ ఇడ్లీ పిండిలా ఇది మరీ పలుచగా ఉండకూడదు. పిండి కాస్త గట్టిగా అనిపిస్తే, మిగిలిన అరకప్పు కొబ్బరి పాలు కూడా కొద్దికొద్దిగా కలుపుకుంటూ ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ పిండిని తీసుకుని ఇడ్లీ ప్లేట్లలో మామూలు ఇడ్లీల్లాగే సర్దుకోవాలి. దీనిపై ఒక మూత పెట్టి కదపకుండా అరగంట పాటు పక్కన పెట్టేయాలి.
-అంతే అరగంట తర్వాత చూస్తే.. అటుకులు ఆ కొబ్బరి పాలను పీల్చుకుని ఎంతో మృదువైన, కమ్మటి ఇడ్లీలుగా తయారవుతాయి.
రుచికరమైన చట్నీ తయారీ ఇలా
-చట్నీ కోసం ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలను కూడా తరిగి పెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, టమాటా ముక్కలు, కొద్దిగా బెల్లం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మరీ పలుచగా కాకుండా, కొంచెం చిక్కగా ఉండేలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటే.. ఇడ్లీలోకి అదిరిపోయే సూపర్ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications