Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
Central Bank Gold Buying Crashes 80% in January, Falls to Just 5 Tonnes WGC -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
గోబీ, క్యాబేజీ ఏదీ వద్దు.. కేవలం ఉల్లిపాయలతో అదిరిపోయే మంచూరియా..ఎలా చేసుకోవాలంటే..
మనందరికీ మంచూరియన్ అంటే మహా ఇష్టం. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ బండ్ల దగ్గర దొరికే గోబీ మంచూరియన్ లేదా క్యాబేజీ మంచూరియన్ రుచిని ఆస్వాదించడానికి జనం క్యూ కడుతుంటారు. అయితే బయట దొరికే ఆహారం ఎప్పుడూ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగని ఇంట్లో గోబీ మంచూరియన్ చేయాలంటే కాలిఫ్లవర్ ని శుభ్రం చేయడం, ఉడికించడం పెద్ద పనిలా అనిపిస్తుంది.
అయితే ఇంట్లో ఉండే కేవలం ఉల్లిపాయలతో కూడా అద్భుతమైన మంచూరియన్ తయారు చేసుకోవచ్చు. ఎలాంటి కాలిఫ్లవర్ లేదా క్యాబేజీ అవసరం లేకుండా చేసుకునే ఈ ఆనియన్ మంచూరియన్ రుచిలో ఏమాత్రం తీసిపోదు. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు: 3
మైదా పిండి: పావు కప్పు
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి): పావు కప్పు
కారం: రుచికి సరిపడా
ఉప్పు: తగినంత
అల్లం, వెల్లుల్లి: 1 స్పూన్
పచ్చిమిర్చి: 2
క్యాప్సికమ్: 1
సోయా సాస్: 1 స్పూన్
చిల్లీ సాస్: 1 స్పూన్
టమాటో సాస్: 2 స్పూన్లు
నూనె: వేయించడానికి సరిపడా
కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్: గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇప్పుడు ఇందులో మైదా, మొక్కజొన్న పిండి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మొదట నీళ్లు పోయకుండా చేత్తో గట్టిగా పిసికినట్లు కలపండి. ఉల్లిపాయల నుండి వచ్చే తేమ పిండికి పడుతుంది. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చిలకరించి, మిశ్రమాన్ని గట్టి పకోడీ పిండిలా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేశాక కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి నూనెలో వేయండి. ఈ ఉండలు బంగారు రంగులోకి వచ్చే వరకు, కరకరలాడేలా మీడియం మంట మీద వేయించుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మరో చిన్న గిన్నెలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా పలచని మిశ్రమంలా కలుపుకుని పక్కన ఉంచండి.
-స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లో టాస్ చేయండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న సాస్ మిశ్రమాన్ని ఇందులో పోయాలి. చిటికెడు ఉప్పు, కారం వేసి సాస్ దగ్గర పడే వరకు ఉడికించాలి.
-సాస్ చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ఉండలను ఇందులో వేసి, హై ఫ్లేమ్‌లో టాస్ చేయండి. సాస్ అంతా ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు) చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఉల్లిపాయ మంచూరియన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications




