Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
ఇడ్లీ లేదా దోశల్లోకి రోజూ రొటీన్ గా చేసుకునే కొబ్బరి పచ్చడి, టమాటా చట్నీ లేదా స్పైసీ పల్లీల చట్నీ తిని మీకు బోర్ కొట్టిందా? అయితే కాస్త భిన్నంగా, సులభంగా తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన రెసిపీ ఉల్లిపాయ చట్నీ.
ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు ఉల్లిపాయ చట్నీ చేస్తే మీ ఇంట్లో వాళ్లు మామూలుగా తినేదానికంటే రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు. నోరూరించే ఉల్లిపాయ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉల్లిపాయ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - పావు టీస్పూన్
మినప్పప్పు - అర టీస్పూన్
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - 4 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 5
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో
పసుపు - అర టీస్పూన్
ఉల్లిపాయలు - 4
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకు - ఒక గుప్పెడు
పుదీనా - ఒక గుప్పెడు
కొత్తిమీర - ఒక గుప్పెడు
నీళ్లు - తగినన్ని
తాలింపుకి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినప్పప్పు - అర టీస్పూన్
ఎండు మిర్చి - 1
కరివేపాకు - ఒక రెమ్మ
ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు వేసి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో పల్లీలు వేసి మంటను సిమ్ లో ఉంచి మాడిపోకుండా వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత అందులో ఎండు మిరపకాయలు, చింతపండు, కాస్త పసుపు వేసి అన్నీ కలిసేలా బాగా వేయించాలి.
-ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పాన్ లో వేయాలి. దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు లేత గులాబీ రంగులోకి మారే వరకు మగ్గనివ్వాలి.
-ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత.. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఆకులను వేసి కేవలం ఒక్క నిమిషం పాటు వేయించాలి. ఇలా ఆకుకూరలు వేయడం వల్ల చట్నీకి రెట్టింపు రుచి వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని, తగినన్ని నీళ్లు కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. రుబ్బిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
-చివరగా తాలింపు కోసం.. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఈ తాలింపును రెడీగా ఉన్న చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే స్పెషల్ ఉల్లిపాయ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












