Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పిండి రుబ్బే పనిలేదు, పులియబెట్టక్కర్లేదు..10 నిమిషాల్లో కరకరలాడే మామిడి దోసె..ఎలా చేసుకోవాలంటే..
మామిడి పండు ఇష్టం లేని వారు బహుశా ఎవరూ ఉండరు. దీని అద్భుతమైన రుచి, కమ్మని సువాసన ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. సాధారణంగా మనం మామిడి పండ్లను ముక్కలుగా కోసుకుని తింటాం లేదా జ్యూస్,మ్యాంగో షేక్, ఊరగాయ, తీపి పచ్చడి వంటివి తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ అద్భుతమైన రుచినిచ్చే ఇదే మామిడి పండుతో మన రోజూవారీ బ్రేక్ ఫాస్ట్ దోసె కూడా వేసుకోవచ్చని మీకు తెలుసా? ఉదయాన్నే మీ నాలుకకు ఒక సరికొత్త రుచిని పరిచయం చేయాలంటే ఈ మామిడి దోసె పర్ఫెక్ట్ ఛాయిస్.

మామిడి దోసె కేవలం రుచిలోనే కాదు, తయారీలో కూడా ఎంతో ప్రత్యేకమైనది. సాధారణ దోసెల్లాగా దీని కోసం బియ్యం, మినపప్పు నానబెట్టి, రుబ్బి, రాత్రంతా పులియబెట్టాల్సిన అవసరమే లేదు. అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఇన్ స్టంట్ రెసిపీ ఇది. బియ్యప్పిండి లేదా ఉప్మా రవ్వ వాడటం వల్ల ఈ దోసె ఎంతో కరకరలాడుతూ వస్తుంది. మామిడి పండు సహజమైన తీపికి, కొద్దిగా బెల్లం తోడైతే వచ్చే ఆ కమ్మదనం మాటల్లో చెప్పలేనిది.
మామిడి దోసె తయారీకి కావలసిన పదార్థాలు
పండిన మామిడి పండు రసం (గుజ్జు) - 1 కప్పు
బియ్యప్పిండి లేదా ఉప్మా రవ్వ - 1 కప్పు
బెల్లం లేదా పంచదార - రుచికి సరిపడా
యాలకుల పొడి - అర టీస్పూన్
డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం) - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - దోసెలు కాల్చడానికి

మామిడి దోసె తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో మామిడి పండు గుజ్జు, బియ్యప్పిండి, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, ఎక్కడా ఉండలు కట్టకుండా మన రెగ్యులర్ దోసె పిండి లాగా కాస్త జారుగా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి, పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడెక్కాక కొద్దిగా నెయ్యి రాసి, తయారు చేసి పెట్టుకున్న పిండిని గరిటెతో దోసెలా పల్చగా పోసుకోవాలి. మంటను మీడియంలో ఉంచి, దోసె అంచుల వెంబడి కొద్దిగా నెయ్యి వేయాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోసెను కమ్మగా కాల్చుకోవాలి.
-అంతే మామిడి దోసె రెడీ. వేడివేడిగా, కరకరలాడే ఈ దోసెను పళ్ళెంలో వడ్డించుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి చట్నీ అవసరం లేదు. కానీ వేడి దోసెపై కొద్దిగా కరిగించిన నెయ్యి వేసుకుని, పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుని తింటే ఆ రుచి రెట్టింపు అవుతుంది.
-ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ వెరైటీ దోసె వేసి పెడితే ఆశ్చర్యపోవడమే కాదు, రెసిపీ కూడా అడిగి తెలుసుకుంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
