Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
నో మైదా,నో ఈస్ట్..ఇంట్లోనే బేకరీ స్టైల్ సాఫ్ట్ రాగి బ్రెడ్ ఇలా చేసుకోండి!
ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన ఈ రోజుల్లో, మైదాతో చేసిన బ్రెడ్ తినడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. సాధారణంగా బేకరీలలో దొరికే బ్రెడ్ లో మైదాతో పాటు ఈస్ట్, ఇతర ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అయితే బ్రెడ్ తినాలనే కోరికను వదులుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మనకు ఎంతో మేలు చేసే సిరిధాన్యాల్లో ఒకటైన రాగితో అద్భుతమైన, ఆరోగ్యకరమైన బ్రెడ్ తయారు చేసుకోవచ్చు. అదీ కూడా ఎలాంటి ఈస్ట్ ఉపయోగించకుండానే. రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి కూడా మైదా బ్రెడ్ కంటే ఈ రాగి బ్రెడ్ బెస్ట్ ఆప్షన్.

రాగి బ్రెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి పిండి
-ఇస్పాగుల
-పాలు
-ఉప్పు
-పొడి చేసిన చక్కెర
-వంట నూనె
-బేకింగ్ పౌడర్
-ఈనో పౌడర్
-తెల్ల నువ్వులు
-అవిసె గింజలు
-గుమ్మడి గింజలు
రాగి బ్రెడ్ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల(300గ్రా) రాగి పిండి, పావు కప్పు ఇస్పాగుల, అర టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్ల పొడి చేసిన చక్కెర, 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ వేసి అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో 1 కప్పు పాలు పోసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వంట నూనె వేసి కలుపుకోవాలి. మధ్య మధ్యలో మరో ముప్పావు కప్పు పాలను అందులో కొద్దికొద్దిగా పోస్తూ పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. రాగి పిండి పాలను త్వరగా పీల్చుకుంటుంది కాబట్టి పాలను ఒకేసారి కాకుండా చూసుకుంటూ కలుపుకోవాలి.
-పిండి మిశ్రమం కాస్త మృదువుగా తయారైన తర్వాత, చివరగా 1 టీస్పూన్ ఈనో పౌడర్, 1 టేబుల్ స్పూన్ పాలను వేసి బాగా కలపాలి. ఈనో వేయడం వల్ల పిండిలో గాలి చేరి బ్రెడ్ చాలా స్పాంజీగా, మృదువుగా వస్తుంది.
-ఇప్పుడు బ్రెడ్ టిన్ కు కొద్దిగా నూనె రాసి, అడుగున బట్టర్ పేపర్ వేసి.. సిద్ధం చేసుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో సమానంగా వేసుకోవాలి.
-బ్రెడ్ పైన అదనపు పోషకాల కోసం తెల్ల నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలను పైన చల్లుకోవాలి. బేక్ చేయడానికి బ్రెడ్ రెడీ అయింది.
-ఇప్పుడు ఒవెన్ ను 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ముందే 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. అందులో బ్రెడ్ టిన్ పెట్టి సుమారు 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఓవెన్ లేని వారు అడుగు మందంగా ఉండే గిన్నెలో ఉప్పు వేసి కూడా స్టవ్ మీద బేక్ చేసుకోవచ్చు.
-బేక్ అయిన తర్వాత బయటకు తీసి, పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే బ్రెడ్ విరిగిపోతుంది. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే స్లైసుల్లా కట్ చేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి బ్రెడ్ మీ ఇంట్లోనే రెడీ. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం టీ టైమ్ స్నాక్ గా పీనట్ బట్టర్ లేదా మీకు నచ్చిన జామ్ రాసుకుని దీన్ని ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications