Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం
ఖీర్ లేదా పాయసం అనే పదం వింటేనే చాలు, తీపి ప్రియులకు అప్రయత్నంగా నోరూరిపోతుంది. ఏ శుభకార్యమైనా, పండుగైనా మన ఇళ్లలో ఖీర్ ఉండాల్సిందే. సాధారణంగా మనం బియ్యం పాయసం, సేమియా, లేదా మఖానా ఖీర్ వంటివి ఎంతో ఇష్టంగా తింటుంటాం. కానీ మీరు ఎప్పుడైనా పచ్చి కొబ్బరి పాయసం రుచి చూశారా? ఒక్కసారి ఈ లేత కొబ్బరి పయసం రుచి చూశారంటే, ఇక మిగతా ఏ పాయసం కూడా మీకు ఆనదు. ఇది నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతాన్ని తలపిస్తుంది.

పచ్చి కొబ్బరి పాయసం తయారీకి కావలసిన పదార్థాలు
లేత కొబ్బరికాయల నీరు - 2 కాయలవి
లేత కొబ్బరి మీగడ/గుజ్జు - 2 కాయలది
తాటి బెల్లం లేదా కొబ్బరి బెల్లం - 3 నుండి 5 టేబుల్ స్పూన్లు
తురిమిన పచ్చి కొబ్బరి - సగం కొబ్బరికాయ నుండి
గోరువెచ్చని నీరు - ముప్పావు కప్పు
పచ్చి కొబ్బరి పాయసం తయారీ విధానం
-ముందుగా తాజాగా తురిమిన కొబ్బరిని ఒక మిక్సీ జార్ లో వేసుకోండి. అందులో అరకప్పు గోరువెచ్చని నీరు పోసి 3 నుంచి 5 నిమిషాల పాటు అలాగే నాననివ్వండి. గోరువెచ్చని నీరు వాడటం వల్ల కొబ్బరి నుంచి పాలు సులభంగా వస్తాయి.
-ఇప్పుడు మిక్సీని ఆన్ చేసి ఆ మిశ్రమం మెత్తగా, క్రీమీగా మారేంత వరకు 1 లేదా 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేయండి.
-ఇప్పుడు ఒక పలుచని శుభ్రమైన కాటన్ వస్త్రం తీసుకుని, ఈ మిశ్రమాన్ని అందులో వేసి ఒక గిన్నెలోకి వడకట్టండి. మీ చేతులతో గట్టిగా పిండుతూ చిక్కటి కొబ్బరి పాలను వేరు చేయండి.
-మిగిలిన కొబ్బరి పిప్పిని మళ్లీ మిక్సీలో వేసి, మిగిలిన పావు కప్పు గోరువెచ్చని నీరు పోసి మరోసారి బ్లెండ్ చేయండి. మళ్లీ వస్త్రంతో వడకట్టి పాలను తీయండి. ఈ పాలను ముందుగా తీసిపెట్టుకున్న పాలలో కలపండి. ఇప్పుడు స్వచ్ఛమైన, తాజా కొబ్బరి పాలు రెడీ. వీటిని పక్కన పెట్టుకోండి.

-మరొక మిక్సీ జార్ తీసుకుని, అందులో పచ్చి కొబ్బరి నీళ్లు పోయండి. దానికి సగం లేత కొబ్బరి మీగడను జతచేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయండి. మిగిలి ఉన్న సగం కొబ్బరి మీగడను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో మిక్సీ పట్టుకున్న
కొబ్బరి మీగడ పేస్ట్, తయారుచేసుకున్న తాజా కొబ్బరి పాలు, రుచికి
సరిపడా బెల్లం వేయండి. బెల్లం పూర్తిగా కరిగి, మిశ్రమం అంతా ఏకమయ్యేలా
గరిటెతో బాగా కలపండి.
చివరిగా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న లేత కొబ్బరి ముక్కలను ఇందులో
వేసి సున్నితంగా కలపండి.
-పొయ్యి వెలిగించాల్సిన అవసరమే లేకుండా ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి పాయసం రెడీ.
-దీనిని ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లబడిన తర్వాత తినండి. ఈ స్వచ్ఛమైన ఖీర్ మీ నాలుకకు పండుగ చేయడమే కాకుండా, శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
