Latest Updates
-
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? -
ఆగష్టులో ప్రధాన గ్రహాల రాశి మార్పులు.. ఈ నాలుగు రాశుల వారికి లక్కే లక్కు.! -
శుక్ర గ్రహ గోచారం.. ఈ మూడు రాశుల వారికి కెరీర్లో కొత్త అవకాశాలు.! -
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.! -
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్గా సాగేందుకు టిప్స్.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.! -
మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం!
మిక్సీ, స్టవ్ తో పనేలేదు.. 5 నిమిషాల్లో అద్భుతమైన రాజస్థానీ స్పెషల్ డుంగ్రీ చట్నీ ఎలా చేసుకోవాలంటే..
రోజూ తినే కూరగాయలతో మీకు బాగా బోర్ కొట్టిందా? సొరకాయ, బీరకాయ, బెండకాయ, గుమ్మడికాయ వంటి కూరలు తిని తిని మీ నాలుకకు రుచి చచ్చిపోయిందా? ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా వండిన కూరలు తినాలనిపించనప్పుడు, క్షణాల్లో చేసుకోగలిగే స్పెషల్ రెసిపీనే రాజస్థాన్ ప్రసిద్ధ డుంగ్రీ చట్నీ. కారంగా, పుల్లగా ఉండే ఈ చట్నీ రుచి చూశారంటే.. కంచంలో మెతుకు కూడా వదలకుండా వేళ్లు నాక్కుంటూ తింటారు. వేడి వేడి అన్నం, రోటీ, చపాతీ లేదా పరాటాల్లోకి ఇది ఎంతో పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ చట్నీ తయారు చేయడానికి మిక్సీతో పనీ లేదు, రోట్లో వేసి గంటల కొద్దీ దంచాల్సిన అవసరమూ లేదు. నోరూరించే రాజస్థానీ డుంగ్రీ తడ్కా చట్నీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

రాజస్థానీ డుంగ్రీ తడ్కా తయారీకి కావలసిన పదార్థాలు
పెద్ద ఉల్లిపాయ - 1
టమాటో - 1
వెల్లుల్లి రెబ్బలు - 10 నుండి 12
వేయించిన పల్లీలు (వేరుశెనగలు) - 10 నుండి 15
తాజా కొత్తిమీర - కొద్దిగా
కారం, ఉప్పు - రుచికి సరిపడా
ఆవ నూనె - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - కొద్దిగా
రాజస్థానీ డుంగ్రీ చట్నీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని, తొక్క తీసి శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా ముక్కలుగా తరగాలి. అలాగే ఒక టమోటాను కూడా సన్నగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. దానికి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులను కలపాలి.
-ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకుని, అందులో 10-12 వెల్లుల్లి రెబ్బలు, 10-15 వేయించిన పల్లీలు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా చూసుకోవాలి. దంచిన ఈ వెల్లుల్లి, పల్లీల మిశ్రమాన్ని ఉల్లిపాయ, టమోటా ముక్కలు ఉన్న గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో మీ రుచికి తగినట్లుగా కారం, సరిపడా ఉప్పు వేయాలి.
-ఈ చట్నీకి అసలైన రుచినిచ్చేది ఆవ నూనె. సుమారు 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనెను తీసుకుని గోరువెచ్చగా వేడి చేయాలి. ఆ వేడి నూనెను చట్నీ మిశ్రమంలో పోయాలి. నూనె కొద్దిగా చల్లారిన తర్వాత, మీ చేతులతో ముక్కలన్నింటికీ మసాలాలు, నూనె పట్టేలా బాగా పిసకాలి. ఇలా చేత్తో కలపడం వల్ల ఉల్లిపాయ, టమోటాలలోని రసం బయటకు వచ్చి చట్నీకి అద్భుతమైన రుచి వస్తుంది.
-అంతే ఘుమఘుమలాడే రుచికరమైన రాజస్థానీ డుంగ్రీ తడ్కా చట్నీ రెడీ. దీని రుచి ముందు పంచభక్ష్య పరమాన్నాలు కూడా సాటిరావు. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఇది చట్నీ రుచిని రెట్టింపు చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications