Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Poori Without Oil: నూనె లేకుండా పూరీలు..ఎలా చేసుకోవాలో చూడండి
పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి ఎక్కువగా తీసుకునే ఐటమ్స్ లో పూరీ ఒకటి. పూరీ పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది వేడి వేడిగా కాగిన నూనెలో నుంచి బుసబుసా పొంగుతున్న చిత్రం మన కళ్ల ముందు మెదులుతుంది. అయితే ఆయిల్ ఫుడ్ కి దూరంగా ఉండాలనే కారణంతో చాలామందికి పూరీలు తినాలని కోరిక ఉన్నా కూడా వెనుకాడుతుంటారు. అలాంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్. ఇకపై రుచికి రాజీ పడకుండా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా రుచికరమైన నూనె చుక్క అవసరం లేని పూరీని ఆస్వాదించవచ్చు.
నూనె చుక్క అవసరం లేని సగ్గుబియ్యం పూరీ..సాంప్రదాయ పూరీల రుచిని మరిపించే ఈ అద్భుతమైన వంటకం, మీ ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ముందుంటుంది. నూనెలో వేయించకపోవడం వల్ల ఇందులో కేలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాల్ గురించి ఆందోళన చెందాల్సిన పనే లేదు. బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటిది. కేవలం 25-30 నిమిషాల్లోనే రెడీ చేసుకోగల ఈ పూరీలు ఉపవాస దీక్షలో ఉన్నవారికి లేదా లైట్ బ్రేక్ ఫాస్ట్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవడం ఖాయం. చుక్క నూనె అవసరం లేని పూరీలు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-సగ్గుబియ్యం - 1 కప్పు
-బంగాళాదుంపలు - 2
-పచ్చిమిర్చి - 2
-ఉప్పు - సరిపడా
-కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర పొడి - అర టీస్పూన్
-బొంబాయి రవ్వ లేదా గోధుమ పిండి - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా సగ్గుబియ్యన్ని శుభ్రంగా కడిగి కనీసం 4-5 గంటలు లేదా వీలైతే రాత్రంతా నానబెట్టాలి. సబ్బయ్యం మెత్తగా, పువ్వుల్లా వికసించాలి. ఆ తర్వాత అందులోని నీటిని పూర్తిగా వంపేసి, చేత్తో గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు బంగాళదుంపలను ఉడికించి వాి పొట్టు తీసి, ఉండలు లేకుండా మెత్తగా మెదపాలి.
-ఇప్పుడు మెత్తగా మెదిపిన బంగాళుంపలో నానబెట్టిన సగ్గుబియ్యం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి.

-ఒకవేళ పిండి మరీ జిగటగా అనిపిస్తే, ఆకృతి కోసం కొద్దిగా బొంబాయి రవ్వ లేదా గోధుమ పిండిని చేర్చుకోవచ్చు. ఇది పూరీలు విరిగిపోకుండా, సులభంగా ఒత్తడానికి సహాయపడుతుంది.
-కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీ కర్రతో కాస్త మందంగా, గుండ్రంగా పూరీల్లా ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద నాన్ స్టిక్ పెనం పెట్టి వేడి చేయాలి. నూనె వేయకుండా ఒత్తుకున్న పూరీలను పెనంపై వేసి, మీడియం మంట మీద రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చాలి.
-పూరీలు మాడిపోకుండా మధ్యమధ్యలో తిప్పుతూ ఉండాలి. అంతే వేడివేడి, ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం పూరీలు రెడీ. ఈ పూరీలను చల్లటి పెరుగు, పచ్చిమిర్చి చట్నీ లేదా మీకు ఇష్టమైన రైతాతో కలిపి తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
