Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Breakfasts for diabetic dads: నో షుగర్,జస్ట్ లవ్..డయాబెటిక్ తండ్రుల కోసం బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లు ఇవే
ఈ రోజుల్లో షుగర్ పేషెంట్ లేని ఇళ్లు తక్కువగానే ఉంటాయి. చాలా ఇళ్లల్లో ఇంట్లో ఎవరో ఒకరికి షుగర్ వ్యాధి ఖచ్చితంగా ఉండటం చూస్తుంటాం. అయితే ఆడవాళ్లతో పోల్చితే మగవాళ్లల్లోనే ఎక్కువగా ఇది చూస్తుంటాం. అయితే మన జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే షుగర్ వ్యాధిని మనమీద దాడి చేయకుండా ఆపొచ్చు..అదేవిధంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ ఏడాది జూన్ 15న ఫాదర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా మీ తండ్రికి షుగర్ వ్యాధి ఉంటే..ఒకవేళ లేకున్నా ఇకమీదట వారికి రాకుండా ఉండాలన్నా వారికి మంచి బ్రేక్ ఫాస్ట్ చేసిపెట్టండి.
హైదరాబాద్ లోని ఇమెన్స్ డయాబెటీస్, థైరాయిడ్ హాస్పిటల్ లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ దీప్తి కరేటి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో ద్వారా వారంలోని ఏడు రోజుల్లో షుగర్ పేషెంట్లు తినదగిన బ్రేక్ ఫాస్ట్ ల గురించి వివరించారు. ఇవి మీ డయాబెటిక్ తండ్రుల కోసమనే ఏం లేదు..మీ ఇంట్లోని అందరికీ ఇవి చేసి పెట్టడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉంటే ఏ వ్యాధులు దరిచేరకుండా ఉండొచ్చు. మరి ఈ డాక్టర్ దీప్తి సూచించిన హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెసిపిలు ఏవి,వాటిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

షుగర్ పేషెంట్స్ కి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లు ఇవే
-మూంగ్ దాల్ దోశ(పెసరట్టు)
ఇందులో ఫైబర్, ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పెసలు, బియ్యం రాత్రంతా నానబెట్టి తర్వాత వాటిని మిక్సీలో వేసి ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్క, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పిండితో పెసరట్టు పోసుకోవాలి.
-ఓట్స్ ఉప్మా
ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల LDL కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు రావు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. ఓట్స్ లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శెగనపప్పు, మినపప్పు, పల్లీలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, మీకు నచ్చిన కూరగాయలు వేసి వేయించి ఇందులో నీళ్లు, పసుపు, ఉప్పు వేసి మరిగించాక ఇందులో వేయించిన ఓట్స్ వేసి కలుపుకుంటే ఓట్స్ ఉప్మా రెడీ.

-మేతి పరాఠా
మెంతులు,గోధుమపిండి కలిపి చేసే రోటీ. గోధుమ పిండిలో తరిగిన మెంతి ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, ఉప్పు,నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా మెత్తగా, సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒత్తుకొని పెనం మీద పరాఠాలు వేసుకోండి.
ఇడ్లీ,దోశ కాదు..మన పూర్వీకులు పొద్దున్నే తిన్నది ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి..ఎలా చేసుకోవాలంటే
-బేసన్ చీల(శనగపిండితో చేసే రోటి)
దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది..షుగర్ పెరగకుండా ఉంటుంది.
-మిల్లెట్ దోస
కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, అరికలు, ఊదలు వీటిలో ఏదైనా మీకు నచ్చిన ఒకటి లేదా కలిపి తీసుకొని రాత్రంతా నానబెట్టి తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన మినపగుళ్లు, మెంతులను నీళ్లు వంపేసి మిక్సీలో వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా, నురుగు వచ్చేలా రుబ్బుకోవాలి. ఈ రెండు పిండిలను కలిపి 8 గంటలు పులియబెట్టి తర్వాత ఉప్పు కలిపి దోశలు పోసుకోవడమే. ఇది ఫైబర్, ప్రోటీన్, ఇతర పోషకాలతో నిండి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది.
-మల్టీ గ్రెయిన్ ఇడ్లీ
కందిపప్పు,మినపప్పు,పెసరపప్ప,మెంతులు వేసి చేసే ఇడ్లీలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి.

-స్టీమ్డ్ దహీ వడ
ఆవిరిలో ఉడికించిన మినప్పిండితో పెరుగులో యాడ్ చేస్తే ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది,గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటది కాబట్టి గట్ హెల్త్ కి ఇది మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
