Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ హెల్దీ రాగి ఓట్స్ లడ్డు..ఇంట్లోనే తయారుచేసుకోండిలా..
రాగి ప్రపంచంలోనే కాల్షియం అత్యధికంగా ఉండే చిరుధాన్యాలలో ఒకటి. ఇది భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఆహారంలో భాగంగా ఉంది. ఇందులో కాల్షియంత పాటు ఐరన్, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. ఇక ఓట్స్ గురించి చెప్పాలంటే ఇది బీటా గ్లూకాన్స్ (Beta-Glucans) అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ (Soluble Fiber) కు ప్రసిద్ధి చెందింది, ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెండూ కలిసి తయారయ్యే లడ్డు, ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన స్నాక్ ఎంపిక. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు మరియు రక్తహీనత, మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
రాగి ఓట్స్ లడ్డు తయారీకి కావాల్సిన
పదార్థాలు
-రాగి పిండి-ఒకటిన్నర కప్పు
-ఓట్స్ పిండి-1 కప్పు
-పాలు- పావు కప్పు
-నెయ్యి-3 టేబుల్ స్పూన్లు
-యాలకల పొడి- 1 టీస్పూన్
-తెల్ల నువ్వులు- పావు కప్పు
-జీడిపప్పు- 12
-కొబ్బరి తురుము- పావు కప్పు
-ఖర్జూరం- 20
-తేనె- అరకప్పు

రాగి ఓట్స్ లడ్డు తయారీ విధానం
-ఓట్స్ ను లైట్ గా వేయించి మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఖర్జూరాల నుండి విత్తనాలను తీసివేయండి. మిక్సీ లో 15 ఖర్జూరాలు,పాలు వేసి పేస్ట్ లా చేసుకోండి. మిగిలిన ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో తెల్ల నువ్వులను వేసి పొడిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లో జీడిపప్పు వేసి పొడిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఓట్స్ పిండిని తక్కువ మంట మీద కొన్ని నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు మరో పాన్ తీసుకుని మిగిలిన నెయ్యిని వేడి చేసి, రాగి పిండిని వేసి అది పచ్చిదనం పోయే వరకు తక్కువ మంట మీద వేయించాలి.
-ఇప్పుడు ఓట్స్ పిండిని రాగి పిండిలో కలిపి, తక్కువ మంట మీద రెండూ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసుకున్న ఖర్జూరపు పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత సగం తేనె వేసి కలపాలి.
-ఇప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలపండి. కొన్ని నిమిషాలు తక్కువ మంట మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-మిశ్రమాన్ని స్టవ్ మీద నుండి తీసి కొంతసేపు చల్లారనిచ్చాక అందులో కట్ చేసి ఉంచిన ఖర్జూరపు ముక్కలను, మిగిలిన తేనె వేసి బాగా కలపండి.
-ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని, అందులో జీడిపప్పు వేసి లడ్డు రూపంలో తయారు చేసుకోండి.
-తర్వాత ఓ ప్లేట్ లో వేయించిన నువ్వులను, కొబ్బరి తురుము వేసి కలిపి..చుట్టుకున్న లడ్డును ఈ మిశ్రమంలో వేసి అటూ ఇటూ తిప్పితే సరిపోతుంది. అంతే టేస్టీ రాగి ఓట్స్ లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications