Latest Updates
-
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్!
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా..
తెలుగు వారికి పంచబక్ష పరమాన్నాలు ప్లేట్ లో ఉన్నా తప్పనిసరిగా పచ్చడి ఉండి తీరాల్సిందే. అయితే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, చాలా తక్కువ టైంలో ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉన్న పదార్థాలతోనే రుచికరమైన, పౌష్ఠికమైన పచ్చడి తయారరుచేయాలనుకుంటే ఉల్లి పచ్చడి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు.
ఉదయం ఆఫీసులకు వెళ్లేవాళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు బాక్స్ లో పెట్టడానినికి ఉల్లి పచ్చడి బెస్ట్ గా ఉంటుంది. ఈ పచ్చడి ఫ్రిజ్ లో పెట్టుకుంటే 4 రోజుల దాకా ఫ్రెష్ గా ఉంటుంది.అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లోకి కూడా ఇది నంజుకోడానికి సూపర్ గా ఉంటుంది. ఉల్లి పచ్చడి మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఉల్లిపాయ పచ్చడి తయారీకి కావాల్పిన పదార్థాలు
-ధనియాలు
-జీలకర్ర
-ఉల్లిపాయలు
-వెల్లుల్లి
-కొత్తిమీర
-చింతపండు
-కారం
-ఉప్పు
-నూనె
-ఎండుమిర్చి
-కరివేపాకు
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో..
ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పెద్ద సైజులో కట్ చేసుకున్న 4 ఉల్లిపాయల ముక్కలు, గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి అవి మంచిగా వేగేదాకా వేయించాలి. ఇవి వేగుతున్నప్పుడు ఇందులో కొత్తిమీర, నిమ్మకాయంత సైజు చింతపండు వేసి వాటిని కూడా కలిపి వేయించాలి.
-ఉల్లిపాయలు బాగా వేగాక అందులో 3 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కారం కూడా కలిసిపోయి వేగాక స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు వేయించిన మొత్తం మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయండి.
-తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించాక అందులో కొద్దిగా కరివేపాకు, పసుపు వేసి అంతా ఒకసారి కలిపాక మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి కలుపుకోవాలి. కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి.
-అంతే సూపర్ టేస్టీ ఉల్లి పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
