నోరూరించే ఆంద్రా చికెన్

Andhra Chicken
కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్‌: 1/2 kg
నీళ్లు: 1/2ltr
టొమాటో గుజ్జు: 1cup
ఆరెంజ్‌ రెడ్‌ కలర్‌: 1/4tsp
ఆయిల్‌: 100grms
ఉల్లిముద్ద: 1 cup
కొత్తిమీర తురుము: 1/2cup
పచ్చిమిర్చి: 4
కరివేపాకు: ఒకరెబ్బ
అల్లంవెల్లుల్లిముద్ద: 1tbsp
కొబ్బరిముద్ద: 1tbsp
గసాలముద్ద: 1tsp
గరంమసాలా పొడి: 1tbsp
కారం: 1tbsp
పసుపు: 1/4tsp
మిరియాల పొడి: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్‌ ముక్కల్ని శుభ్రంగా కడిగి అల్లంవెల్లుల్లి, ఉప్పు, పసుపు పట్టించి కాసేపు నాననిచ్చి, కుక్కర్‌ లో కొద్దిగా నీళ్లుపోసి 15 నిమిషాలు ఉడికించాలి.
2. పాన్ లో ఆయిల్ పోసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసి వేరుగా ఉంచుకోవాలి. అదే పాన్లో ఉల్లిముద్ద దోరగా వేయించి మిగిలిన అల్లంవెల్లుల్లి కూడా వేసి వేయించాలి.
3. అందులోనే మసాలాపొడి, ఉప్పు, కారం, కొబ్బరిముద్ద, గసాల ముద్ద, మిరియాలపొడి అన్నీ వేసి బాగా కలిపి టొమాటో గుజ్జు కూడా వేసి తిప్పాలి.
4. చికెన్‌ ముక్కలు, కొద్దిగా ఫుడ్‌ కలర్‌ వేసి సన్నటి సెగమీద ఉడికించాలి. ముక్కలు వేగిన తరవాత కొత్తిమీర తురుము, వేయించి ఉంచిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాల తరువాత పక్కకు దింపుకోవాలి అంతే నోరూరించే ఆంధ్రా చికెన్‌ రెడీ.!

Story first published: Tuesday, August 17, 2010, 15:52 [IST]
Desktop Bottom Promotion