Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ గారెలు: వీకెండ్ స్పెషల్
సాధారణంగా చికెన్ తో తయారుచేసే వంటలంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చికెన్ తో తయారుచేసే వెరైటీ డిష్ లంటే మరింత ఇష్టంగా తింటారు. ఈ మద్యకాలంలో ఫాస్ట్ ఫుడ్స్ బాగా ఫేమస్ అయ్యాయి.
చికెన్ పులుసు, గారెలు శీతాకాలంలో తగిన శక్తినీ, శరీరానికి వేడినీ ఇస్తాయి. మాంసంలోని ప్రోటీన్ లు విలువైనవి. మినపప్పులోని ఫైబర్(పీచు)ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చికెన్ తో కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది.
READ MORE: చిల్లీ చికెన్ బిట్స్ : వింటర్ స్పెషల్
చికెన్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవారు. ఇలాంటి సింపుల్ వంటలను తయారుచేసుకోవచ్చు. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం మరియు చాలా తక్కువ పదార్థాలతో దీన్ని తయారుచేస్తారు. మరి ఈ సింపుల్ అండే టేస్టీ చికెన్ గారెలను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్ - 1/2kg
శనగపప్పు - 3cups
గరం మాసాలా - 2 tsp
కారం - 2 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2tbsp
పచ్చిమిరిపకాయలు - 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు - 3(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు - 1/4tsp
కొత్తిమీర కట్ట - 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నూనె: డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
READ MORE: రెడ్ చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్: నాన్ వెజ్ స్పెషల్
తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. తర్వాత చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు ముందుగా నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
4. తర్వాత పేస్ట్ చేసుకొన్న శెనగపప్పు ముద్దలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పడు పాన్ స్టై మీద పెట్టి నూనె సోపి వేడి అయ్యాక అందులో కొద్దిగా చికెన్ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి.అంతే చికెన్ గారెలు రెడీ.



Click it and Unblock the Notifications











