చికెన్ మఖానీ...!

Chicken Makhani
కావలసిన పదార్థాలు:
చికెన్ ముక్కలు: 1/2kg
కాశ్మీరీ చిల్లీపౌడర్: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
నిమ్మరసం: ఒక కాయది
పెరుగు: 1cup
ఉల్లిపాయలు: 3-4
అల్లం పేస్టు: 2tsp
వెల్లుల్లి పేస్టు: 2tsp
గరం మసాలాపౌడర్: 1tsp
ఆవనూనె: 2tsp
వెన్న: 2tsp
టొమాటో ప్యూరీ: 1cup
పచ్చిమిర్చి: 4-6
పసుపు: 1/4tsp
ఫ్రెష్ క్రీమ్: 50ml
మిరప్పొడి: 1tsp
జీడిపప్పు: 10-15
బాదంపప్పు: 10-15
పంచదార: 1tsp
నూనె: తగినంత
కొత్తిమీర: కట్ట

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలకు పెరుగు, ఉప్పు, మిరప్పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆవనూనె వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి.
2. తర్వాత కడాయిలో వెన్న వేసి పెరుగు మిశ్రమంలో నానిన చికెన్ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టాలి.
3. వెంటనే మరొక చిన్న బౌల్లో కొద్దిగా నీరు పోసి జీడిపప్పు, బాదంపప్పులను ఉడికించి పేస్టు చేయాలి.
4. తర్వాత మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. ఆ మిశ్రమం బాగా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ, కాశ్మీరీ చిల్లీపౌడర్, ఉప్పు, మిరప్పొడి, గరం మసాలా పౌడర్, పసుపు వేసి బాగా కలిపి కొద్దిగా నీటిని పోసి ఉడికించాలి.
5.ఇవి ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత జీడిపప్పు, బాదంపప్పు పేస్టు వేసి ఉడికించాలి. చివరగా రోస్ట్ చేసిన చికెన్ ముక్కలను, పైన కొద్దిగా వెన్న వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత పైన ఫ్రెష్‌క్రీమ్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే చికెన్ మఖానీ రెడీ........

Story first published: Tuesday, May 1, 2012, 16:31 [IST]
Desktop Bottom Promotion