Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
యగ్ బిర్యాని

బియ్యం - 1/2 kg
కోడి గ్రుడ్లు - 6
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2tbsp
ధనియాలు - 2 tbsp
గసగసాలు - 1tsp
చెక్కలవంగాలు - 1/2 tsp
మరాఠి మొగ్గ - 2
బిర్యానీ ఆకు - 2
కొత్తిమీర - 1 cup
పుదీనా - 1 cup
పచ్చిమిర్చి - 6
కొబ్బరి తురుము - 1 cup
పసుపు - 1/2 tsp
జీడిపప్పు - 50grms
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారు చేయు విధానము:
1. గ్రుడ్లు ఉడకేసి పై కవచం తొలగించి నాలుగు ప్రక్కలా గాట్లు పెట్టాలి.
2. అల్లం, వెల్లుల్లి పేస్ట్ సగం, పచ్చిమిర్చి పేస్ట్ సగం, గసగసాలు, ధనియాల పొడి ముద్దల్లోంచి సగం, తగినంత ఉప్పు , పసుపు వేసి కలియబెట్టాలి.
3. ఈ మిశ్రమాన్ని గాట్లు పెట్టుకున్న గ్రుడ్లకి పట్టించి, ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి కాగిన తర్వాత అందులో మసాల పొడులు పట్టించుకున్న గ్రుడ్లను వేసి ఎర్రగా వేపి పక్కన తీసి పెట్టుకోవాలి.
4. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి అది కాగిన తర్వత అందులో చెక్కలవంగాలు, యాలకులు, జీడిపప్పు, మరాఠి మొగ్గ, బిర్యాని ఆకు వేసి కొద్ది సేపు వేనివ్వాలి.
5. తర్వాత అందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, మిగిలిన గసగసాలు మరయు ధనియాల పొడి వేసి కలిపి కొబ్బరి పాలుపోసి లీటరు నీళ్ళు పోసి పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
6. బియ్యాన్ని నీటితో శుభ్రంగా కడిగి నీటిని వంపేసి మరుగుతున్న నీళ్ళులో వేయాలి. బియ్యం ఉడుకుతుండగా వేసిన గ్రుడ్లను వేసి కలిపి మూత పెట్టిపది నిమిషాలు తక్కువ మంట మీద మగ్గనివ్వాలి, అంతే ఎగ్ బిర్యానీ రెడీ.



Click it and Unblock the Notifications











