Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఎగ్ పులావ్ రిసిపి : డిన్నర్ స్పెషల్
మనకందరికీ నచ్చిన ఫేవరెట్ డిష్ లలో ఎక్కువ ఇష్టమైనది మరియు అతి త్వరగా తయారుచేసుకొనే రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్. ముఖ్యంగా ఎగ్ ఫైడ్ రైస్ చాలా సులభంగా, అతి త్వరగా మరియు టేస్టీగా పూర్తి న్యూట్రీషియన్స్ తో తయారయ్యే వంట ఎగ్ ఫ్రైడ్ రైస్. అయితే ఎప్పుడూ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఎగ్ పులావ్ తయారు చేసుకోవచ్చు.
పచ్చిబఠాలనీలు మరియు నువ్వులు చేర్చడం వల్ల ఈ ఎగ్ పులావ్ మరింత టేస్ట్ గా ఉంటుంది. తాజా వెజిటేబుల్స్, ఎగ్ మరియు పచ్చిబఠానీలు, టమోటో ఉపయోగించి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో తయారుచేస్తున్నాం. ఎగ్ పులావ్ ను చాలా మంది ఇష్టపడుతారు. ఇది ఒక రుచికరమైన హెల్తీ అండ్ న్యూట్రీషియన్ డిష్. మీకుటుంబ సభ్యులతో పాటు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గ్రీన్ పీస్-ఎగ్ కాంబినేషన్ ఫ్రైడ్ రైస్ మీకు ఒక కొత్త ట్రీట్ అనిపించవచ్చు. కాబట్టి, ఈ రుచికరమైన నాన్ వెజిటేరియన్ రిసిపి తయారుచేయడానికి ఇది ఒక మంచి సమయం. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
అన్నం: 2 cups
గుడ్లు: 2
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు: 4(తరిగినవి)
టమోటాలు : 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
పచ్చిబఠానీలు: 1/4cup
పసుపు పొడి : 1/2 tsp
కారం పొడి: 1tsp
బ్లాక్ పెప్పర్ పొడి: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
వేగించిన నువ్వులు: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత, ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, పచ్ఛిబఠానీలు కూడా వేసి మరికొద్దిసేపు ఉపయోగించుకోవాలి.
3. తర్వాత గుడ్డు పగులగొట్టి అందులో పోయాలి. మంటను మీడియంగా పెట్టి గుడ్డు బాగా ప్రై అయ్యే వరకూ కలియబెడుతూ వేగించాలి.
4. గుడ్డు వేగుతున్నప్పుడే అందులో ఉప్పు, మిరియాలపొడి, పసుపు, కారం, టమోటో ముక్కలు వేసి 5నిముషాలు ఉడికించుకోవాలి.
5. ఇలా మొత్తం మిశ్రమం వేగిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నవ వేసి బాగా కలగలుపుతూ మిక్స్ చేయాలి. అలాగే అందులో గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
6. మొత్తం మిశ్రమం వండిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి ముందుగా వేగించి పెట్టుకొన్న నువ్వులను చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఎగ్ పులావ్ రిసిపి రెడీ. దీన్ని కర్రీతో లేదా కర్రీ లేకుండా అలాగే కూడా తినవచ్చు.



Click it and Unblock the Notifications











