చేపతో కట్‌లెట్స్‌

Fish Cutlet
కావలసిన పదార్థాలు:
చేపకీమా: 1/2 kg
బ్రెడ్‌పొడి: 2 cups
వెన్న: 50 grm
జీడిపప్పుపొడి: 1/2 cups
కొబ్బరి పొడి: 1/2 cups
కొత్తిమీర తురుము: 1/2 cups
పుదీనా తురుము: 1/2 cups
కార్న్‌ఫ్లోర్‌: 2 tsp
కారం: 1 tsp
మిరియాల పొడి: 1/2 tsp
యాలకల పొడి: 1/2 tsp
గరంమసాలా: 2 tsp
కార్న్ ఫ్లోర్: కొద్దిగా
నూనె: తగినంత
ఉప్పు: తగినంత

తయారుచేయు విధానం:
1. మొదటగా చేపకీమాలో కారం, మసాలా, యాలకలు, బ్రెడ్‌, మిరియాల పొడి, కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి, పచ్చిమిర్చి పేస్టు, అల్లంవెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా తురుము, కార్న్‌ఫ్లోర్‌, వెన్న వేసి కొద్దిగా నీరు కలిపి మిశ్రమాన్ని బాగా కలిపి ఒక అరగంట పక్కన ఉంచాలి.
2. తరువాత మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసి వడల్లా చేత్తోనే చేసుకొని బ్రెడ్‌పొడిలో దొర్లించి ప్లేటులో పెట్టుకోవాలి.
3. పాన్ లో నూనెవేసి కాగాక వడల్లా తట్టుకొన్న ఫిష్ కట్ లెట్ ను అందులో వేసి వీటిని దోరగా వేయించి తీయాలి.
4. వీటిని టమాటో సాస్‌తోగాని, ఇతర ఏవైనా కెచప్‌లతో పాటు తింటే బాగుం టాయి.

Story first published: Friday, March 5, 2010, 14:39 [IST]
Desktop Bottom Promotion