జింజర్ - గార్లిక్ తో ఆంధ్ర ఫిష్ ఫ్రై

Garlic Fish Fry
కావలసిన పదార్ధాలు:
చందువా చేపలు: 2
అల్లం: అంగుళంముక్క
వెల్లుల్లి: ఒకపాయ
చిల్లీసాస్‌: 3 tsp
కార్న్‌ఫ్లోర్‌: 50grms
వెనిగర్ లేక నిమ్మరసం: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేయు విధానము:
1. చందువా చేప లేదా ఇతర ఏ రకం చేపనయినా తీసుకుని వాటిమీద పొలుసులన్నీ తీసేసి శుభ్రం చేయాలి.
2. తరవాత బాగా కడిగి చాకుతో గాట్లు పెట్టాలి.
3. చేపలకి ఉప్పు, నిమ్మరసం లేక వెనిగర్ పూసి పది నిమిషాలు నానబెట్టాలి.
4. అల్లం వెల్లుల్లిని చాకుతోనే బాగా సన్నగా తరిగి ఖైమా చేసినట్లుగా కొట్టాలి లేదా అల్లం వెల్లుల్లిని మిక్సర్ లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు దీన్ని చేపకు పట్టించి తరవాత చిల్లీసాస్‌ కూడా పూసి ఆపై కార్న్‌ఫ్లోర్‌లో అద్దాలి.
6. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి కాగాక చేపల్ని వేసి రెండువైపులా బాగా వేయించి తీయాలి. అంతే జింజర్-గార్లిక్ ఫిష్ ప్రై రెడీ.

Story first published: Wednesday, August 18, 2010, 16:51 [IST]
Desktop Bottom Promotion