హనీ మస్టర్డ్ చికెన్ వింగ్స్: స్పైసీ క్రిస్మస్ స్నాక్

ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్ లో అంధించే చికెన్ వింగ్స్ ను తిని మీకు బోరుకొడుతోందా?అయితే మోనటనస్ చికెన్ వింగ్ తినడానికి ఇదే మంచి సమయం. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా, ఈ స్పైసీ మస్టర్డ్ చికెన్ వింగ్స్ రిసిపిని ప్రయత్నించి మీ ఇంటికి విచ్చేసే, అతిథులకు ఒక గ్రేట్ టేస్ట్ ను అంధించండి.

ఈ స్పైసీ మస్టర్డ్ చికెన్ వింగ్స్ తయారుచేయడం చాలా సులభం మరియు చాలా తక్కువ సమయంలో ఎక్కువ రుచిగా తయారుచేయవచ్చు. అందులో చాలా తక్కువ పదార్థాలను ఉపయోగించి టేస్టీగా స్పైసీగా తయారుచేసి పండుగను మరింత గ్రేట్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి ఈ స్పైసీ చికెన్ వింగ్స్ క్రిస్మస్ స్పెషల్ ట్రీట్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Honey Mustard Chicken Wings

కావల్సిన పదార్థాలు:
చికెన్ వింగ్స్ : 500grm(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మస్టర్డ్: 3-4tbsp
ఎల్లో మస్టర్డ్: 3tbsp
తేనె: 3tbsp
ఆపిల్ సైడర్ వెనిగర్: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
హాట్ పెప్పర్ సాస్: 2tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఓవెన్ ను 450ఫారన్ హీట్ లో పెట్టాలి. తర్వాత బేకింగ్ షీట్ ను అల్యూమినియం ఫోయల్ తో కవర్ చేసి తర్వాత దానికి మీ కొద్దిగా నూనెను అప్లై చేయాలి.

2. తర్వాత చికెన్ వింగ్స్ ను ఈ బేకింగ్ షీట్ మీద ఒక్కోదానికి మద్యలో గ్యాప్ ఇస్తూ ఒకదినికి ఒకటి అతుక్కోకుండా పెట్టాలి. తర్వాత చికెన్ వింగ్స్ ను 20-25నిముషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ బేక్ చేయాలి.

3. ఇప్పుడు ఒక బౌల్లో, ఎల్లో మస్టర్డ్, దిజోన్ మస్టర్డ్, తేనె, పెప్పర్ సాస్, బ్లాక్ పెప్పర్, సైడర్ వెనిగర్ మరియు ఉప్పు వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, ఈ చిక్కటి మిశ్రమాన్ని బేక్ చేసుకొన్న చికెన్ వింగ్స్ కు అప్లై చేయాలి.

4. తర్వాత తిరిగి ఓవెన్ లో 5నిముషాలు బేక్ చేసి తర్వాత సర్వ్ చేయాలి. అంతే హనీ మస్టర్డ్ చికెన్ వింగ్ రెడీ. ఈ స్పైసీ క్రిస్మస్ స్నాక్ ను కుటుంబ సభ్యులతో పాటు అతిథులకు సర్వ్ చేయాలి.

Story first published: Friday, December 20, 2013, 18:03 [IST]
Desktop Bottom Promotion