Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
కారైకుడి చికెన్ మసాలా టేస్టీ అండ్ స్పైసీ
సాధారణంగా సౌత్ ఇండియన్ వంటలు చాలా అద్భుత రుచిని కలిగి ఉంటాయని ఇండియన్ ఫుడ్స్ ఇష్టపడేవారికి తెలుసు. ఈ సౌత్ ఇండియన్ కుషన్లలోకూడా, చెట్టినాడ్ కుషన్స్ మరింత టేస్టీగా అద్భుతంగా ఉంటాయి . చెట్టినాడ్ కుషన్స్ లో చాలా వరకూ నాన్ వెజిటేరియన్ డిష్ లకు చాలా ప్రసిద్ది. ప్రపంచం మొత్తంలో చెట్టినాడ్ చికెన్ చాలా ప్రసిద్ది చెందినటువంటి నాన్ వెజ్ రిసిపి. అదేవిధంగా, ఈ టేస్టీ చికెన్ కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఇదే చికెన్ రిసిపికి పెప్పర్ మరికొన్ని మసాలా దినుసులను కలిపి తయారుచేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ తో అద్భుతంగా ఉంటుంది. దీన్నే కారైకుడి చికెన్ మసాలా అంటారు.
కారైకుడి చికెన్ మసాలా సాధారణంగా పెప్పర్ చికెన్ మాసాలా తయారుచేస్తారు. అనేక మసాలా దినుసులు మరియు ముఖ్యంగా పెప్పర్ ఈ వంటకు మరింత ఘాటును, రుచిని, సువాసనను కలిగిస్తుంది . ఈ రుచికిరమైన వంటను తమిళనాడులోని, కారైకుడి ప్రాంతంలో ఎక్కువగా తయారుచేస్తారు. అందుకే ఈ వంటను కారైకుడి చికెన్ మసాలా అంటారు మరి ఈ చికెన్ మసాలా వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
చికెన్ : 1 kg
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా మీడియం సైజ్)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగి)
వెల్లుల్లి రెబ్బలు: 5 (తురుము)
ఉప్పు: రుచికి సరిపడా
మ్యారినేషన్ కోసం:
కారం: 1tsp
మిరియాల పొడి: 1tsp
పసుపు: 1tsp
పెరుగు: ½cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
కొబ్బరి పేస్ట్ కోసం :
కొబ్బరి తరుము: 2tbsp(తురుమినది)
గసగసాలు 1tbsp
సోంపు: 1tsp
మసాలా ముద్దకోసం:
అల్లం: 1 మీడియం సైజ్ ముక్క
వెల్లుల్లి : 8-10
ఉల్లిపాయ -3 (మీడియం సైజ్ )
పచ్చిమిర్చి : 3
బ్లాక్ పెప్పర్ కార్న్: 10
ధనియాలు: 1tbsp
పోపుకోసం:
ఆయిల్: 2tbsp
సోంపు ½ tsp
లవంగాలు: 3
చెక్క 1
యాలకులు 2
బిర్యానీ ఆకు: 1
పుదీనా : 1tbsp(సన్నగా తరుగుకోవాలి)
కరివేపాకు : రెండు రెమ్మలు
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మ్యారినేషన్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని ఒక బౌల్లో వేసి, అందులోనే చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసి, ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మసాలా ముద్దకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ ను తయారుచేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు వేరుగా కొబ్బరి, గసగసాలు, సోంపు వేసి కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకొనే పక్కన పెట్టుకోవాలి.
5. ఒక గంట తర్వాత పాన్ లో నూనె వేసి, వేడిచేసి అందులో పోపుకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి 2,3నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో సన్నగ్ తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి, 3,4నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత అందులో పేస్ట్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను వేసి, 5నిముషాలు వేగించుకోవాలి.
8. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకొన్న టమోటో ముక్కలు, ఉప్పు వేసి మరో 2,3నిముషాలు వేగించుకోవాలి.
9. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా వేసి మీడయం మంట మీద 5-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
10. 10 నిముషాల తర్వాత అందులో కొబ్బరి పేస్ట్ కూడా వేసి 10నిముషాలు ఉడికించాలి .
11. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి 15-20నిముషాలు మీడయం మంట మీద ఉడికించుకోవాలి.
12. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి, సర్వ్ చేయాలి. అంతే కారైకుడి చికెన్ మసాలా సర్వ్ చేయడానికి రెడీ. ఈ స్పెషల్ రిసిపి వేడి వేడి అన్నంకు మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications











