Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఖీమా కలేజి: మటన్ - లివర్ ఫ్రై

ఖీమా: 500grms
లివర్: 250grms
ఉల్లిపాయలు: 3
వెల్లుల్లి రెబ్బలు: 8-10
అల్లం: చిన్న ముక్క
పచ్చిమిర్చి: 4(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
జీలకర్ర: 1tsp
బ్లాక్ పెప్పర్: 10
యాలకలు: 4
లవంగాలు: 4
చెక్క: చిన్న ముక్క
కారం : 1tbsp
ధనియా పౌడర్: 1tbsp
టమోటో: 1(కట్ చేసినవి)
పెరుగు: 2tbsp
బిర్యాని ఆకు: 1
కొత్తిమీర తరుగు: 2tbsp
నూనె: తగినంత
నెయ్యి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక వెడ్పాల్పాటి పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో బిర్యాని ఆకును వేసి వేయించాలి.
2. తర్వాత కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
3. అంతలోపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, యాలకులు, పెప్పెర్, చెక్కా, లవంగాలు వీటన్నింటినీ మిక్సీలో వేసుకొని చిక్కటి పేస్ట్ తయారు చేసుకోవాలి.
4. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు అందులో మటన్ ఖీమా, లివర్ ముక్కలు అందులో వేసి స్పూన్ తో కలబెట్టి, తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
5. తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్ని పచ్చిమిర్చి ముక్కలు, మసాలా ముద్ద వేసి, తక్కువ మంటలో ఐదు నుండి పదినిమిషాల పాటు బాగా వేయించాలి.
6. ఇప్పుడు మసాలా బాగా వేగి, నూనె పైకి వస్తున్నప్పుడు చూసుకొని అందులో టమోటో ముక్కలు, ఉప్పు, కారం, మరియు ధనియాలపొడి, వేసి కలబెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
7. అందులో కొద్దిగా నీళ్ళు వేసి, మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాలు వేయించాలి.
8. ఈ మసాలా మిశ్రమం అంతా ఖీమాకు బాగా పట్టి గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు ఒక స్పూన్ గడ్డ పెరుగు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర ఆకులు, నెయ్యితో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే మటన్ ఖీమా కలేజి రెడీ...



Click it and Unblock the Notifications











