Latest Updates
-
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే!
స్పైసీ అండ్ టేస్టీ మంగళూర్ చికెన్ కర్రీ
ధక్షిణ భారత దేశంలో మంగళూరు వంటకాలు చాలా ప్రసిద్ది. ముఖ్యంగా మాంసాహార వంటకాలు. అందులో సీ ఫుడ్ చాలా పాపులర్. మాసాహార వంటకాల్లో వెరైటీగా రుచి చూడాలంటే మంగళూరు వంటకాల్ని ఇంట్లో ప్రయత్నించవచ్చు. ఈ మంగళూరు మాంసాహార వంటలు కారం కారంగా రుచి... మంచి రంగుతో ఘుమఘుమలాడుతుంటాయి.
మంగళూరులో చికెన్ కర్రీ చాలా ఫేమస్ వంటకం. చికెన్ ఘుమఘుమలాడే ఒక అద్భుతమైన రుచికలిగిన చికెన్ గ్రేవీ. దీన్ని తయారుచేయడానికి కొన్ని మసాలా దినుసులను ఉపయోగిస్తారు. మంగళూర్ చికెన్ వంటకలు ప్రత్యేకంగా ముఖ్యమైన పదార్థంగా ఫ్రెష్ గా ఉండే కొబ్బరిని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ ట్రెడిషనల్ మంగళూరియన్ చికెన్ కర్రీ చాలా స్పైసీగా ఉంటుంది. కాబట్టి మీరు చికెన్ వంటకాల్లో వెరైటీ రుచిచూడాలంటే ఈ మంగళూరియన్ చికెన్ రిసిపిని ప్రయత్నించండి...

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg
పసుపు: 1/4tsp
ఉప్పు: రిచికి సరిడా
నిమ్మరసం: 2tsp
పెరుగు: 1/2cup
నూనె: 1/2cup
మసాలా కోసం కావల్సినవి:
బిర్యానీ ఆకులు: 2
మిరియాలు: 1/2tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
మెంతులు: 1/2tsp
ధనియాలు: 2tsp
జీలకర్ర: 1tsp
ఎండుమిర్చి: 8
లవంగాలు: 3
వెల్లుల్లి రెబ్బలు: పావుకప్పు
ఫ్రెష్ కొబ్బరి తురుము: 1/2cup
చింతపండు గుజ్జు : 1/2tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో పెరుగు, తగినంత ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి.
2. ఈ మిశ్రమాన్ని చికెన్ కి పట్టించి అరగంట నుంచి గంటసేపు నాననివ్వాలి.
3. తర్వాత పాన్ లో కొబ్బరి, చింతపండు తప్పా మసాలా కోసం సిద్ధం చేసుకొన్న పదార్థాలన్నింటినీ వేసి, వేయించుకుని తీసుకోవాలి.
4. వేయించిన మసాలా దినుసుల యొక్క వేడి తగ్గిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోనే కొబ్బరి మరియు చింత పండు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి.
5. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి చికెన్ ముక్కల్ని వేసేయాలి. అవి కొద్దిగా వేగాక సగం మసాలా వేసి అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టేయాలి.
6. కొద్దిపేసపటికి చికెన్ ఉడుకుతుంది, అప్పుడు మిగిలిన మసాలాలను కూడా వేయాలి .
7. చికెన్ కు మసాలాలను బాగా పట్టి, కూర ఫ్రైలా అయ్యాక దింపేయాలి. అంతే నోరూరించే మంగళూర్ చికెన్ కర్రీ సిద్ధం...



Click it and Unblock the Notifications











