Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
నోరూరించే చికెన్ కుర్మా: లక్నో స్పెషల్
నోరూరించే చికెన్ కుర్మా తయారుచేయడం చాలా సులభం మరియు ఇంట్లోనే మంచి ఫ్లేవర్ తో తయారుచేసుకోవచ్చు. ఈ లక్నో రెస్టారెంట్ కుషన్స్ లో ఫుల్ ఫ్లేవర్ ఫుల్ రిసిపి ఇది. బిర్యానీ, కుర్మాలు అవద్ కుషన్స్ లో చాలా ఫేమస్ అయినటువంటి డిష్ లు.
చికెన్ కుర్మా లక్నోస్టైల్లో మీకోసం అందిస్తున్నాం. ఈ వంటకు ఎక్కువ తయారుచేసే పదార్థాలు అవసరం లేదు. ఒక సారి రుచి చూస్తే మీరు మళ్లీ ఎప్పటికీ మరవలేనటువంటి రుచితో ఈ కుర్మా ఉంటుంది. మరి ఈ స్పెషల్ లక్నో స్టైల్ చికెన్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నెయ్యి లేదా నూనె: 4tbsp
ఉల్లిపాయలు: 4(సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
యాలకలు: 5(పొడి చేసుకోవాలి)
లవంగాలు: 5-6
అల్లం పేస్ట్: 2tbsp
వెల్లుల్లి పేస్ట్ 2tbsp
పెరుగు: 1cup
ధనియాల పొడి: 2tbsp
కారం: 1tbsp
పసుపు: 1tsp
గరం మసాలా: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి లేదా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
3. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి . తర్వాత ఈ ఫ్రైడ్ ఉల్లిపాయలను మిక్సీలో వేసుకోవాలి.
4. ఇప్పుడు మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు అదే పాన్ లో యాలకులపొడి మరియు లవంగాలు వేసి వేగనివ్వాలి .
6. తర్వాత చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద 4-5నిముషాలు వేగించుకొని, ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.
7. ఇప్పుడు అందే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ధనియాలపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు కారం వేసి రెండు మూడు నిముషాలు వేగించుకవాలి.
8. ఇప్పుడు లైట్ గా వేగించుకొన్న చికెన్ ముక్కలను అందులో వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
9. తర్వాత అందులోనే ఉల్లిపాయ పేస్ట్ మరియు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి.
10. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, మూత పెట్టి 20నుండి 25 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
11. కొద్దిగా నీళ్ళు జోడించి మద్యమధ్యలో కలియబెడుతుండాలి.
12. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత గరం మసాలా చల్లి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పది నిముషాల తర్వాత మూత తీసి సర్వ్ చేయాలి. అంతే లక్నో స్టైల్ చికెన్ కుర్మా రెడీ. ఈ రుచికరమైన చికెన్ కుర్మాను రోటీ లేదా పరోటాలతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











