Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
మటన్ నాదన్ కర్రీ: కేరళ స్టైల్
కేరళ కుషన్స్ లో వివిధ రకాల వెరైటీలున్నాయి. ఉదాహరణకు నాదన్ రిసిపిలు. ఇవి కేరళ రిసిపిలలో స్పెషల్ మరియు వెరైటీ వంటలు . నాదన్ రిసిపి తయారుచేసే పద్దతిని ఉపయోగించి మటన్ కర్రీని తయారుచేయడం జరిగింది. ఈ కేరళ స్టైల్ నాదన్ మటన్ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే మసాలా దినుసులను ఫ్రై చేసి పేస్ట్ చేసి తయారుచేయడం జరిగింది.
సాంప్రధాయంగా మనం ఉపయోగించే మసాలా దినుసులనే ముందుగా ఫ్రై చేసి, తర్వాత పేస్ట్ చేసి, మటన్ కర్రీని తయారుచేయబడింది. ఈ మటన్ కర్రీకి ఒక ప్రత్యేకత ఉంది, కొబ్బరి ఉపయోగించడకుండా ఈ మటన్ కర్రీని చాలా అద్భుతమైన రుచితో తయారుచేస్తారు. సాధారణంగా కొబ్బరి వాడకం లేనిదే వంటలు తయారుచేయని కేరళీయులు, నాదన్ రిసిపి వంటి కొన్ని రకాల వంటలు తయారు చేసేటప్పుడు కొబ్బరి ఉపయోగించకపోవడం ఆశ్చర్యకరం. మరి ఈ కేరళ స్టైల్ నాదన్ మటన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
మటన్ -500 గ్రాముల (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1tsp
ఎండు మిర్చి: 10
కొత్తిమీర: 1tsp
సోంపు: 1tsp
లవంగాలు: 5
చెక్క : చిన్న ముక్క
మిరియాలు: 10
బేబీ ఉల్లిపాయలు: 5(తరిగినవి)
ఉల్లిపాయలు: 2(తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు: 5 (పేస్ట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (మద్యలోకి కట్ చేసుకోవాలి)
అల్లం:చిన్న ముక్క
టమోటో: 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
గరం మసాలా పొడి: 1tsp
కరివేపాకు: 5
నూనె: 3tbsp
ఉప్పు : రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో మటన్, ఉప్పు, పసుపు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి, 4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
2. అంతలోపు, స్టౌ మీద పాన్ పెట్టి, వేడయ్యాక అందులో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, చెక్క, మిరియాలు, లవంగాలు వేసి రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
3. తర్వాత వాటని మరో ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో చిన్న ఉల్లిపాయలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
4. అన్ని వేయించుకొన్న తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత వాటిని జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసికొని పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత ఒ్ డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి కూడా వేసి మరో 2,3నిముషాలు వేయించుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే టమోటో మరియు ఉప్పు కూడా వేసి టమోటో మెత్తబడే వరకూ వేయించుకోవాలి. తర్వాత అందులోనే మెత్తగా పేస్ట్ చేసుకొన్న మసాలా పేస్ట్ ను కూడా వేసి, వేయించుకోవాలి.
7. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న మటన్ లోని నీరు వంపేసి తర్వాత వేగుతున్న మసాలా మిశ్రమంలో వేసి మరో 5నిముషాలు వేయించుకోవాలి . బాగా వేగిన తర్వాత అందులో గరం మసాలా వేసి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి.
8. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్నితక్కువ మంట మీద మరో 10నిముషాలు ఉడికించుకోవాలి. అంతే కేరళ స్టైల్ మటన్ కర్రీ రెడీ. ఇది నీర్ దోసెకు బెస్ట్ కాంబినేషన్.



Click it and Unblock the Notifications











