Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
పాలక్ ప్రాన్ కర్రీ రిసిపి: వీకెండ్ స్పెషల్
చాలా మందికి సీఫుడ్ అంటే చాలా ఇష్టం. సీఫుడ్స్ లో ప్రాన్స్ ను పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి ప్రాన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఉపయోగించే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకోసం ప్రత్యేకంగా తయారు చేసేటప్పుడు ఈ వంట యొక్క కలర్, ఆకారం, రుచి అన్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రాన్స్ ను వండేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా తయారు చేయాలి. అప్పుడే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చూడగానే తినాలనిపించే వంటకం.
మీరు రెగ్యులర్ గా తినే వంటలతో కొంచెం బోర్ గా ఫీలవుతుంటే, వంటలు తయారుచేసే పద్దతని మార్చండి. రొయ్యలతో చాలా తక్కువగా వెరైటలు వండుతారు. రొయ్యలతో వండే వంటలు టేస్టీగా ఉంటాయి. ఈ అద్భుతమైన రుచికి కొంచెం స్పైసీ మరియు మసాలా దినుసులు జోడించి తయారుచేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు:
రొయ్యలు - 200grms(పొట్టు వలచి, శుభ్రం చేసిన)
పాలకూర తరుగు - 2cups
ఉల్లిపాయ - 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లంవెల్లుల్లి పేస్టు - 2tsp
కారం - 1tsp
దనియాలపొడి - 1tsp
గరం మసాల పొడి - 1tsp
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
పచ్చిమిర్చి - 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె - సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో రొయ్యల్ని పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి.
2. మరో పాన్ లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి రెండు నిమిషాలు వేగించాలి.
3. ఇప్పుడు అందులోనే రొయ్యలు, కారం, దనియాలపొడి కలిపి మరికొద్దిసేపు వేగించాలి.
4. తర్వాత పాలకూర తరుగు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. పాలకూర మెత్తబడ్డాక కప్పు నీటిని చేర్చి మరికొద్దిసేపు ఉడికించాలి.
5. రొయ్యలు ఉడికి, కూర చిక్కబడ్డాక గరం మసాల పొడి వేసి దించేయాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది. (ఇష్టమైతే పాలకూర తరుగు బదులు దాన్ని ఉడికించి, పేస్టుచేసి కూడా కలుపుకోవచ్చు). అంతే పాలక్ ప్రాన్ కర్రీ రెడీ...



Click it and Unblock the Notifications











