స్పైసీ కడై చికెన్ - చపాతి

కావలసిన పదార్థాలు
చికెన్: 1kg
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tsp
కారం: ౩tsp
చికెన్ మసాల పౌడర్: 2tsp
పెరుగు: 1 cup
నిమ్మ కాయ: 1
పూదీన: 1 కట్ట
కొత్తిమీర: 1 కట్ట
మెంతి ఆకు: 1 cup
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
ఉల్లి పాయలు: 2
కర్రివేపాకు: రెండు రెమ్మలు
ఆవాలు,జీలకర్ర తగినంత

తయారు చేసే విధానం

1. ముందుగా ఒక కడై తీసుకొని తగినంత నూనె వేసుకొని వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
2. తర్వాత అందులోనే చికెన్ వేసుకొని బాగా వేయించాలి.
3. ఇప్పుడు పసుపు, ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం వేసి మరికొద్దిసేపు వేయించి మెత్తగా ఉడక పెట్టాలి.
4. తర్వాత చిన్నగా తరిగిన పుదీనా ,కొత్తిమీర వేయాలి. ఎండిన మెంతి ఆకు ఒక కప్పు వేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత పెరుగు వేసి, నిమ్మ కాయ పిండాలి.
5. ఫైనల్ గా చికెన్ మసాల పౌడర్ వేసి బాగా కలిపి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి అంతే కడై చికెన్ రెడీ. ఈ టేస్టీ కడై చికెన్ చపాతీ లోకి బాగుంటుంది.

Story first published: Thursday, July 7, 2011, 17:11 [IST]
Desktop Bottom Promotion