Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చాలా సింపుల్ పెప్పర్ లెమన్ చికెన్
మద్యహ్నా భోజనానికి ఏదైనా రుచికరమైన వంటను మీరు కోరుకుంటున్నట్లైతే, అందులో సింపుల్ పెప్పర్ చికెన్ రిసిపి ఒకటి. ఇది చాలా అద్భుత రుచితో పుల్లపుల్లగా మరియు సాప్ట్ గా ఉంటుంది.
ఈ నాన్ వెజ్ రిసిపిని తయారుచేయడానికి చికెన్ బ్రెస్ట్ ఒక ఉత్తమ ఎంపిక. ఈ వంటను తయారుచేసిన అరగంట తర్వాత దీన్ని తినడం వల్ల గ్రేవీలో చికెన్ బాగా ఊరుతుంది. చికెన్ కు మసాలాలన్ని బాగా పడుతాయి.
ఈ రుచికరమైన నాన్ వెజ్ రిసిపి మరింత బెటర్ టేస్ట్ గా స్పైసీగా ఉండాలంటే, అందులో పెప్పర్, లెమన్ జోడించాలి. ఈ వంట గీరైస్ లేదా పీస్ పులావ్ కు చాలా అద్భుతంగా ఉంటుంది . మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్ : 2ముక్కలు
అల్లం: 2 tsp
వెల్లుల్లి: 2 tsp
మిరియాల పొడి : 2 tbsp
పసుపు: 1 tsp
జీలకర్ర పొడి: 2 tsp
కొత్తిమీర పొడి: 2 tsp
గరం మసాలా పొడి: 1tsp
ఎర్ర కారం: 1tsp
నిమ్మరసం: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పెరుగు: 1cup
ఆయిల్: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి, వాటినికి కొద్దిగా పసుపు, ఉప్పు రాసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. చికెన్ బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ దీన్ని ఫ్రై చేయాలి.
4. ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి వేసి చికెన్ తో పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత పసుపు, జీలకర్ర, కొత్తిమీర, మిరియాలపొడి, గరం మసాలా, మరియు కారం వేసి ఫ్రై చేసుకోవాలి. పాన్ లో సైడ్స్ లో ఆయిల్ పైకి కనబడుతున్నట్లైతే, ఇప్పుడు అందులో నిమ్మరసం జోడించి బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు వేసి బాగా బీట్ చేయాలి.
7. తర్వాత చికెన్ ఉన్న పాన్ స్టౌ మీద నుండి పక్కకు తీసి,అందులో పెరుగువేసి బాగా మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు తిరిగా స్టౌ మీద పెట్టి మంటను పూర్తిగా తగ్గించాలి. మొత్తం మిశ్రమంగా బాగా మిక్స్ అయ్యి, చికెన్ కు బాగా పట్టి, డ్రై అయ్యే వరకూ మిక్స్ చేస్తూ ఉడికించాలి. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే లెమన్ చికెన్ రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications











