Latest Updates
-
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.!
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.!
కాలీఫ్లవర్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది స్నాక్స్, సైడ్ డిష్. దీంతో కూరలను చేసుకుని తినడం చాలా రేర్. అయితే ఎప్పుడైనా కాలీఫ్లవర్‌తో నిల్వ పచ్చడి ట్రై చేశారా.? ఎప్పుడూ నిమ్మకాయ, ఉసిరికాయ, ఆవకాయ పచ్చళ్లేనా.. మరి వీటి సీజన్ లేనప్పుడు, ఇంట్లో నిల్వ పచ్చళ్లు లేనప్పుడు వేడిగా అన్నంలోకి ఏం తినాలి అని బెంగపడటం సహజమే. అలాంటి వారి క్రేవింగ్స్‌ను తీర్చేలా కమ్మనైన కాలీఫ్లవర్ పికిల్ను ట్రై చేయండి. రెగ్యులర్ పచ్చళ్లతో పోలిస్తే ఈ పచ్చడి చేయడం చాలా సులభం.

కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
కాలీఫ్లవర్- 500 గ్రాములు
మెంతులు- అర టీస్పూన్
ఆవాలు- రెండు టేబుల్ స్పూన్లు- పౌడర్ సిద్ధం
చేసుకోవాలి
నూనె- ముప్పావు కప్పు
పచ్చి శనగపప్పు- రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు- టీస్పూన్
ధనియాలు- రెండు టీస్పూన్లు
కరివేపాకు- ఐదు రెబ్బలు
వెల్లుల్లి రెబ్బలు- 20
ఇంగువ- అర టీస్పూన్
కారం- 50 గ్రాములు
ఉప్పు- 40 గ్రాములు
నిమ్మకాయలు- రెండు
కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి తయారీ విధానం
ముందుగా తాజా కాలీఫ్లవర్‌ను తీసుకుని పురుగులు లేకుండా చూసుకుంటూ ఒకే సైజు ఉండేలా ముక్కలను కట్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని కాసేపు నీళ్లలో ఉంచిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకోండి. వీటిని ఉడికించాల్సిన పని లేదు.
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే..
ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో మెంతులు, ఆవాలు వేసి దోరగా వేయించండి. తర్వాత కాసేపు చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసుకోండి.

స్టవ్‌పైన అదే పాన్‌లో నూనె వేసి కాగిన బాగా తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, ధనియాలు వేసి వేయించండి. ఇప్పుడు కచ్చాపచ్చాగ దంచిన పది వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వండి. ఆ వెంటనే మిగిలిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఇప్పుడు శుభ్రంగా తడి లేకుండా కాలీఫ్లవర్ ముక్కల్లో కారం, ఉప్పు, సిద్ధం చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసి మొత్తం కలిసేలా కలపండి.
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.!
తాలింపు చల్లారిన తర్వాత దానిని కారం పట్టించిన కాలీఫ్లవర్ ముక్కల్లో వేసి గరిటెతో కూడా చేతి వేళ్లతో బాగా కలపండి. చివరిగా నిమ్మరసం పిండుకోండి. కాసేపటి తర్వాత తడిలేని, శుభ్రంగా ఉన్న గాజు డబ్బాలో పెట్టుకుని గాలి చొరబడకుండా గట్టిగా మూత పెట్టి స్టోర్ చేసుకోండి.
కాలీఫ్లవర్ పచ్చడిని ఈ విధానంలో చేస్తే నెల రోజులపైనే నిల్వ ఉంటుంది. ఇంట్లో పచ్చళ్లు లేనప్పుడు, లంచ్ బాక్స్‌లోకి హడావుడిగా ఉన్నప్పుడు కూరలు లేకపోయినా ఈ పచ్చడితో కడుపు నిండా తినేయొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
