Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
పనీర్ లేకుండానే పాలక్ పనీర్!..ఈ 2.0 రెసిపీ చూస్తే వెంటనే వండేస్తారు!
భారతీయ ఇళ్లల్లో పాలక్ పనీర్ అనగానే నోరూరని వారుండరు. వేడి వేడి రోటీ, నాన్ లేదా బగారా రైస్‌తో దీన్ని తింటుంటే ఆ మజానే వేరు. అయితే, ఇది వండటానికి చాలా సమయం పడుతుందని, పైగా ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని చాలామంది దీనికి దూరంగా ఉంటారు.
కానీ మీ అపోహను చెరిపేస్తూ, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే సరికొత్త పాలక్ పనీర్ విధానం ఒకటి ఉంది. క్రీమ్ వాడకుండానే ఎంతో కమ్మగా ఉండే పాలక్ పనీర్ 2.0 రెసిపీని మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో ప్రముఖ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ ఆతిరా సేతుమాధవన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.

పాలక్ పనీర్ 2.0 తయారీకి కావలసిన పదార్థాలు
ఆవ నూనె - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
టొమాటో ప్యూరీ - 120 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
తరిగిన పాలకూర - 220-250 గ్రాములు
మెత్తటి పనీర్ - 200 గ్రాములు
వేడి నీళ్లు - సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
తాలింపుకి ఆవ నూనె - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - ముప్పావు టీస్పూన్
కశ్మీరీ కారం పొడి - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు- 4
పాలక్ పనీర్ 2.0 తయారీ విధానం
-ముందుగా ఒక బాండీలో ఒక టీస్పూన్ ఆవ నూనె వేడి చేసి, తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి కాసేపు మగ్గనివ్వాలి.
-ఇప్పుడు బాండీలో టొమాటో ప్యూరీ, తగినంత ఉప్పు వేసి గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తర్వాత అందులో తరిగిన పాలకూర వేసి, ఆకులు మెత్తబడే వరకు 2-3 నిమిషాలు ఉడికించి మంట తగ్గించాలి.
-ఇప్పుడు అసలైన ట్విస్ట్. పనీర్ ను ముక్కలుగా కాకుండా, వేడి నీళ్లు పోసి మిక్సీలో మెత్తని క్రీమ్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట కొన్న క్రీమ్ వాడాల్సిన పనే ఉండదు.
-రెడీ అయిన పనీర్ క్రీమ్ ను పాలకూర మిశ్రమంలో కలిపి, సన్నని మంటపై కేవలం 1-2 నిమిషాలు ఉడికించాలి.
-తాలింపు కోసం మరో చిన్న పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆవ నూనె వేడి చేసి జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు వేయించాలి. అవి లేత బంగారు రంగులోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి, కాశ్మీరీ కారం పొడి వేసి వెంటనే ఆ తాలింపును కూర మీద పోయాలి.
-చివరగా కొత్తిమీర చల్లుకుంటే నోరూరించే, ఎంతో ఆరోగ్యకరమైన పాలక్ పనీర్ 2.0 రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications