Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
అదరగొట్టే టేస్ట్..ఇడ్లీ,దోశలకు పర్ఫెక్ట్ సైడ్ డిష్..రాజస్థానీ వెల్లుల్లి చట్నీ ఎలాచేసుకోవాలంటే
మన ఇళ్లలో రోజూ ఇడ్లీ, దోస, చపాతీ వంటివి సర్వసాధారణం. వాటికి తోడుగా రకరకాల చట్నీలు చేస్తూ ఉంటాం. అయితే రోజూ తినే అవే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలు కొన్నిసార్లు విసుగు తెప్పిస్తాయి. రుచిలో ఏదైనా కొత్తదనం ఉంటే బాగుండనిపిస్తే రాజస్థానీ వెల్లుల్లి చట్నీ ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీనిని తయారుచేయడం చాలా సులభం. ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్ గా, కమ్మగా ఉంటుంది. ప్రయాణాల్లోకి కూడా ఇది ఒక అద్భుతమైన సైడ్ డిష్. ఘుమఘుమలాడే రాజస్థానీ వెల్లుల్లి చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-వెల్లుల్లి రెబ్బలు -20
-ఎండు మిరపకాయలు - 7
-సాంబార్ ఉల్లిపాయలు - 11
-చింతపండు - చిన్న నిమ్మకాయంత
-నువ్వుల నూనె- 3 టేబుల్ స్పూన్లు
-ఆవాలు - 1 టీస్పూన్
-మినపప్పు - 1 టీస్పూన్
-శనగపప్పు - 1 టీస్పూన్
-కరివేపాకు - రెండు రెమ్మలు
-ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా వెల్లుల్లి, సాంబార్ ఉల్లిపాయల పొట్టు తీసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఎండు మిరపకాయల తొడిమలు తీసేయాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి.
-నూనె కాస్త వేడెక్కాక ఎండు మిరపకాయలు వేసి అవి కొద్దిగా ఉబ్బే వరకు దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి.
-అదే బాండీలో మరో స్పూన్ నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు, మంచి సువాసన వచ్చేంత వరకు తక్కువ మంటపై వేయించుకోవాలి.
-వేయించిన వాటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేయించిన మిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు పోపు కోసం బాండీలో మిగిలిన నూనె వేసి వేడిచేయాలి.
-నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మినపప్పు, శనగపప్పు వేసి అవి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. చివరగా కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఈ ఘుమఘుమలాడే పోపును మనం సిద్ధం చేసుకున్న చట్నీలో కలిపితే కారంగా, కమ్మగా ఉండే రాజస్థానీ వెల్లుల్లి చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోస, చపాతీలే కాదు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
