పాకం పట్టే పనిలేకుండా పాతకాలం నాటి పర్ఫెక్ట్ రాగి లడ్డు..ఎముకలు దృఢంగా మారతాయి!

Posted By:

మనం ఏం తింటున్నాం అనేదాని మీదనే మన ఆరోగ్యం దాదాపు ఆధారపడి ఉంటుంది. యన పూరీక్వులు తిన్న బలమైన ఫుడ్స్ తినడం మానేసి ఇప్పుడు ప్యాకెట్లలో నిల్వ చేసిన చిప్స్, స్నాక్స్ వంటివి తింటున్నారు. వీటికారణంగా దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక చాలామంది తల్లులు వారికి మార్కెట్లో దొరికే స్నాక్స్ లేదా న్యూడిల్స్ వంటివి చేసి పెడుతుంటారు. అయితే వీటిని పక్కన పెట్టి మన శరీరానికి అవసరమైన పోషకాలు, బలాన్నిచ్చే సంప్రదాయక స్నాక్ రాగి లడ్డు వారికి ఇవ్వండి.

రాగులలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంతో పాటు రక్తహీనతను నివారిస్తాయి. పిల్లల పెరుగుదలకు, పెద్దవారిలో ఎముకల పటుత్వానికి రాగి లడ్డు ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్ లాగా ఒక రాగి లడ్డు తింటే చాలు, శరీరానికి రోజంతా అవసరమైన శక్తి లభిస్తుంది. పర్ఫెక్ట్ రాగి లడ్డును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Perfect Ragi Laddu Recipe in Telugu Healthy Traditional Finger Millet Snack

రాగి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు

-రాగి పిండి
-యాలకల పొడి
-నెయ్యి
-బెల్లం
-ఎండుకొబ్బరి తురుము
-జీడిపప్పు
-బాదంపప్పు
-జాజికాయ పొడి

స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ బీట్‌ రూట్ జిలేబీ.. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..

రాగి లడ్డు తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి, దాని మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. అందులో 2 కప్పుల రాగి పిండి వేయండి,ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి సన్నని సెగ మీద కలుపుతూ రాగి పిండి మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి. కావాలనుకుంటే రాగి పిండి వేగుతన్నప్పుడే అందులో పావు కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేసుకోవాలి

-రాగి పిండి వేగి,మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసి ఈ మొత్తాన్ని ఒక పళ్లెంలోకి తీసుకోండి.

-తర్వాత స్టవ్ మీద అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు పలుకులు వేసి జీడిపప్పు, బాదంపప్పు ఎర్రగా అయ్యేవరకు మీడియం మంట మీద వేపాలి. వేగిన తర్వాత నెయ్యితో సహా వీటిని వేపుకున్న రాగిపిండిలో వేసి కలుపుకోవాలి.

-ఇప్పుడు ఆ రాగిపిండి మిశ్రమంలోనే 1/8 టీస్పూన్ యాలకల పొడి, 2 చిటికెల్ల జాజికాయ పొడి వేసి కులపుకోండి. జాజికాయ పొడి ఇష్టం లేకుంటే వదిలేయవచ్చు.

-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసి,ఇందులో పావు కప్పు వరకు నీళ్లు పోసి బెల్లాన్ని కరగినిస్తే చాలు, పాకం రానక్కర్లేదు.

-బెల్లం కరిగిపోతే చాలు, పొంగు కూడా రానక్కర్లేదు. బెల్లం కరిగిన తర్వాత దాన్ని జల్లెడలో పోసి వడకట్టి రాగిపిండి మిశ్రమంలో పోసుకోండి. గరిటతో బాగా కలుపుకోండి.

-వేడిగా ఉన్నప్పుడు రాగి లడ్డుూలు చుట్టుకోవాలి, చల్లారాక చుడితే పర్ఫెక్ట్ గా రావు. ఇందుకోసం చల్లని నీటితో చేతిని ముంచి కొంచెం నెయ్యి అరచేతికి రాసుకుని రాగి పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకుంటూ లడ్డుల్లా చుట్టుకోవాలి.

-ఒకవేళ మీకు లడ్డు పర్ఫెక్ట్ గా రావట్లేదు అని అనుకుంటే అందులో 1-2 చెంచాల వేడి నీళ్లు పోసి కలిపి అప్పుడు లడ్డుల్లా చుట్టుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి.

-అంతే పర్ఫెక్ట్ రాగి లడ్డు రెడీ. వీటిని గాలిచొరబడని డబ్బాలో పెట్టుకుంటే వారం రోజుల పైనే నిల్వ ఉంటాయి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion