గుమ్మడికాయ సూప్ రెసిపి: క్రీమీ గుమ్మడికాయ సూప్ తయారుచేయటం ఎలా?

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

మేము గుమ్మడికాయ సూప్ గురించి మాట్లాడేటప్పుడు మీకు రుచి చూడాలని అనిపించవచ్చు. నేను నా స్నేహితుని ఇంటిలో ఉన్నప్పుడు ఈ సూప్ రుచి చూసాను. నా స్నేహితురాలు సూప్ ల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఆమె తయారుచేసిన అనేక రకాల సూప్స్ రుచి చూసాను. వాటిలో ఇది ఉత్తమమైనది నన్ను నమ్మండి. నేను టమోటా,స్వీట్ కార్న్,చికెన్ సూప్ ల గురించి ఆలోచించలేదు. గుమ్మడికాయ సూప్ అనేది ఒక ఆరోగ్యకరమైన మరియు తేలికగా ఎంచుకొనే ఇష్టమైన ఎంపిక. దీనిని ఖచ్చితంగా ఇంటిలో ప్రయత్నించవచ్చు. ఈ సూప్ మంచి రుచి రావాలంటే కొంచెం వెన్న లేదా క్రీమ్ ని జోడించండి.

pumpkin soup recipe
గుమ్మడికాయ సూప్ రెసిపి | క్రీమీ గుమ్మడికాయ సూప్ తయారుచేయటం ఎలా? | క్రీమీ గుమ్మడికాయ సూప్ రెసిపీ | బటర్ నట్ స్క్వాష్ సూప్ రెసిపి
గుమ్మడికాయ సూప్ రెసిపి | క్రీమీ గుమ్మడికాయ సూప్ తయారుచేయటం ఎలా? | క్రీమీ గుమ్మడికాయ సూప్ రెసిపీ | బటర్ నట్ స్క్వాష్ సూప్ రెసిపి
Prep Time
20 Mins
Cook Time
25M
Total Time
45 Mins

Recipe By: పూజ గుప్త

Recipe Type: సూప్

Serves: 6

Ingredients
 • ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు

  ఉల్లిపాయలు - 2 ( సన్నగా కోయాలి)

  గుమ్మడికాయ - 1 కేజీ

  వెజిటబుల్ స్టాక్ లేదా చికెన్ స్టాక్ - 2-3 కప్పులు

  డబుల్ క్రీము - 1 ప్యాక్ ( అముల్ క్రీమ్ )

  క్రోటన్లు కోసం

  ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు

  బ్రెడ్ క్రస్ట్ తొలగించబడింది - 4 ముక్కలు

  గుమ్మడికాయ గింజలు - 1 ప్యాకెట్

  రెడ్ రైస్ కందా పోహ్

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. సాస్ పాన్ పొయ్యి మీద పెట్టి రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిముషాలు వేగించాలి. అయితే ఉల్లిపాయ రంగు మారకూడదు.

  2. గుమ్మడికాయ లేదా స్క్వాష్ చేర్చి 8 నుంచి 10 నిముషాలు ఉడికించాలి. మృదువుగా మరియు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.

  3. వెజిటబుల్ స్టాక్ లేదా చికెన్ స్టాక్ పోసి ఆ తర్వాత ఉప్పు,మిరియాల పొడి కలపాలి.

  4. బాగా మరిగించాలి. స్క్వాష్ మృదువుగా అయ్యేవరకు సిమ్ లో 10 నిముషాలు ఉడికించాలి.

  5. పాన్ లో డబుల్ క్రీమ్ వేసి వేడి చేసి బ్లెండ్ చేయాలి.

  6. అదనపు వెల్వెట్ కోసం జల్లెడ ద్వారా సూప్ పోయవచ్చు.

  7. ఇప్పుడు సూప్ ని 2 నెలల వరకు ఫ్రోజెన్ చేయవచ్చు.

  8. క్రోటన్లు చేయడానికి బ్రేడ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

  9. ఫ్రై పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి బ్రేడ్ ముక్కలను వేగించాలి.

  10. ఆ తర్వాత గుమ్మడికాయ గింజలను వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి.

  11. వీటిని ఒక రోజు ముందుగా తయారుచేస్తారు కాబట్టి ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వ చేయాలి.

  12. రీ హీట్ చేసినప్పుడు అవసరమైతే సూప్ రుచి కోసం మరియు అందం కోసం క్రోటన్లు మరియు గుమ్మడికాయ విత్తనాలను సూప్ మీద జల్లవచ్చు.

  13. స్క్వాష్ ని తొలగించి, గింజలను లేత నుండి బాగా రోస్ట్ చేయాలి. .

  14. . చివర చీజ్ వేసి కరిగే వరకు ఉడికించాలి.

Instructions
 • 1. అదనపు రుచి మరియు సువాసన కోసం వెల్లుల్లి పాడ్స్ ఉపయోగించవచ్చు.
 • 2. మంచి రుచి కోసం రెగ్యులర్ గుమ్మడికాయ కన్నా బటర్ నట్ స్క్వాష్ ఉపయోగించవచ్చు.
Nutritional Information
 • సర్వింగ్ సైజు - 1 కప్పు
 • కేలరీలు - 317 కేలరీలు
 • కొవ్వు - 24 గ్రాములు
 • ప్రోటీన్ - 6 గ్రాములు
 • షుగర్ - 6 గ్రాములు
[ 4 of 5 - 82 Users]
Read more about: pumpkin, soup, cream, vegetarian, dinner
Story first published: Wednesday, November 22, 2017, 15:10 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter