టిఫిన్స్ లోకి ఈ వెల్లుల్లి చట్నీ చేస్తే..రోజూ తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు!

Posted By:

ఇడ్లీ, దోశ,ఉప్మాలోకి రోజూ అవే చట్నీలు తిని తిని బోర్ కొట్టిందా? టిఫిన్స్ లోకి రెగ్యులర్ గా తినే పల్లీ చట్నీ, శనగపప్పు చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో చట్నీలు తిని తిని నాలుక చప్పబడిపోతే ఒక్కసారి వెల్లుల్లి చట్నీ ట్రై చేయండి. టిఫిన్స్ లోకి వెల్లుల్లి చట్నీ అద్భుతంగా ఉంటుంది. వెల్లుల్లి చట్నీ ఉంటే.. రోజూ తినే దోశలు, ఇడ్లీలకన్నా ఒకటి ఎక్కువగానే తినేస్తారు.

సాధారణంగా కూరల్లోనే లేదా ఏదైనా వంటకంలో వెల్లుల్లి కనబడితే తీసి పక్కనపెట్టేవాళ్లు కూడా వెల్లుల్లితో చేసిన చట్నీని ఎగబడి తింటారు. దీని తయారీకి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం ఉండవు. చాలా ఈజీగా, నిమిషాల్లో దీనిని తయారుచేసుకోవచ్చు. టిఫిన్స్ లోకి అదిరిపోయే సూపర్ టేస్టీ వెల్లుల్లి చట్నీ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Quick Easy Amd Tasty Garlic Chutney Recipe in Telugu See How to Make Vellulli Chutney For Tiffins

తయారీకి కావాల్సిన పదార్థాలు

-2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె
-20-30 వెల్లుల్లి రెబ్బలు
-1 టమాటో
-8 ఎండు మిరపకాయలు
-ఉప్పు
-నీరు

తాలింపు కోసం:
1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె
అర టీస్పూన్ ఆవాలు
కరివేపాకు

ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా

తయారీ విధానం

-స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి. అందులో నువ్వుల నూనె వేసి వేడి చెయ్యాలి.

-నూనె వేడెక్కిన తర్వాత అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి అవి మంచి సువాసన వచ్చి, బంగారు గోధుమ రంగులోకి మారేదాకా మీడియం మంట మీద వేయించాలి.

-తర్వాత అందులోనే టమాటో ముక్కలు వేసి అవి మెత్తడేదాకా ఉడికించాలి. తర్వాత అందులోనే ఎండు మిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలిపి మరో నిమిషం పాటు వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-ఇప్పుడు తాలింపు కోసం.. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాక స్టవ్ ఆపేయండి.

-వేగిన తాలింపుని గ్రైండ్ చేసుకున్న చట్నీలో నూనెతో సహా వేసి కలుపుకోండి.

-అంతే సూపర్ టేస్టీ వెల్లుల్లి చట్నీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, October 24, 2026, 21:27 [IST]
Desktop Bottom Promotion