Latest Updates
-
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు!
ప్రతిరోజూ ఉదయం ఇడ్లీ, దోశల్లోకి పల్లీ చట్నీ లేదా సాంబార్ తిని బోర్ కొట్టిందా? అయితే ఇడ్లీ కుర్మా ఓసారి ట్రై చేయండి. ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే హడావిడిలో ఉండే వారికి, సమయం తక్కువగా ఉన్నప్పుడు కేవలం 15 నిమిషాల్లో దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
దీని రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే.. మీ ఇంట్లో వాళ్ళు రోజూ తినేవాటికంటే కచ్చితంగా నాలుగిడ్లీలు ఎక్కువే లాగించేస్తారు. నోరూరించే ఇడ్లీ కుర్మా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ఇడ్లీ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు
మసాలా పేస్ట్ కోసం
నూనె - 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి - 8
పెద్ద ఉల్లిపాయ - 1
సోంపు - 1 టీస్పూన్
గసగసాలు - 1 టీస్పూన్
జీడిపప్పు - 5
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - ముప్పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కుర్మా (గ్రేవీ) తయారీ కోసం
నూనె - 2.5 టీస్పూన్లు
బిర్యానీ ఆకులు - 2
కరివేపాకు - ఒక రెమ్మ
పెద్ద ఉల్లిపాయ - 1
టమాటాలు - 3
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
చిక్కటి కొబ్బరి పాలు - 1 కప్పు
కొత్తిమీర - కొద్దిగా
నీళ్లు - తగినన్ని
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
ఇడ్లీ కుర్మా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. అందులో రెండు స్పూన్ల నూనె వేసి వేడయ్యాక, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో సోంపు, గసగసాలు, జీడిపప్పు వేసి కాసేపు వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. చివరిగా కొబ్బరి తురుము వేసి ఒక్క నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి.
-మిశ్రమం చల్లారాక మిక్సీ జార్ లో తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మళ్లీ స్టవ్ మీద పాన్ పెట్టి రెండున్నర స్పూన్ల నూనె వేయండి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి చిటపటలాడించండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి అవి పూర్తిగా గుజ్జులా మెత్తబడే వరకు మగ్గనివ్వండి. టమాటాలు బాగా ఉడికాక.. ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
-ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను అందులో వేసి బాగా కలుపుకోవాలి. కుర్మాకు సరిపడా నీళ్లు పోసి, మూతపెట్టి సన్నటి మంటపై ఓ 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
-చివరగా అందులో చిక్కటి కొబ్బరి పాలు పోసి కలుపుకోవాలి. కుర్మా ఒక్క ఉడుకు రాగానే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు.
-అంతే గుమగుమలాడే, ఎంతో రుచికరమైన ఇడ్లీ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
